Dementia: పెళ్లి చేసుకునేవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలెక్కువ.. సైంటిస్టులు పేల్చిన భారీ బాం*బు!
Dementia: కానీ ఎన్ని భిన్నతలున్నా, మెదడు ఆరోగ్యానికి కావలసిన విషయాలు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటాయి.

Dementia: పెళ్లి చేసుకునేవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలెక్కువ.. సైంటిస్టులు పేల్చిన భారీ బాం*బు!
Dementia: తీర్థయాత్రలకైనా, పనులకైనా వయసు పెరిగితే సమాజం అడిగే మొదటి ప్రశ్నే పెళ్లి గురించి. ఆఫీస్‌లో స్నేహితులు, ఇంట్లో కుటుంబ సభ్యులు, చుట్టాల ఇంటికి వెళ్తే వాళ్ల ప్రశ్నలు కూడా అదే దిశగా వెళ్తాయి. కానీ ఇటీవల ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. దాదాపు 24 వేల మందిపై 18 ఏళ్ల పాటు నిర్వహించిన ఓ రీసెర్చ్‌లో, పెళ్లైనవాళ్లకన్నా పెళ్లి చేసుకోని వారిలో మతిమరుపు సమస్య తక్కువగా కనిపించిందట.
మతిమరుపు అనేది మెదడుతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్య. దీనిని డిమెన్షియా అంటారు. ఇది మెదడు బలహీనపడే ప్రక్రియ. అల్జీమర్స్ లాంటి సమస్యలు ఇందులో భాగం. మతిమరుపు వచ్చినప్పుడు మనిషి నెమ్మదిగా తన రోజువారీ విషయాలను మర్చిపోతాడు. ఇది వయసుతో పాటు కొన్ని పరిస్థితుల వల్ల మరింత వేగంగా జరగొచ్చు.
పెళ్లి చేసుకోని వారిలో డిమెన్షియా తక్కువగా ఉండటానికి ముఖ్య కారణం వాళ్ల జీవనశైలీ. వాళ్లు సాధారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో స్వతంత్రంగా ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడం, స్నేహితులతో కలిసి గడపడం వంటి సమాజంతో ఉండే కనెక్ట్ మెదడుకు మంచి వ్యాయామంగా ఉంటుంది. అదే సమయంలో, వివాహితుల జీవితంలో అనేక రకాల ఒత్తిడులు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు, అనారోగ్యం, సంబంధాల్లో సమస్యలు.. ఇలా అన్నీ మెదడుపై ప్రభావం చూపుతాయి.
ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పెళ్లైన జంటల్లో ఒకరు ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండటం మొదలుపెడితే, మరోవారు కూడా అదే పద్ధతిని అనుసరించే అవకాశముంది. ఇది మెదడు ఆరోగ్యానికి మేలు చేయదు. మరోవైపు, పెళ్లి కాని వారు తమ జీవితం మీద పూర్తి నియంత్రణ కలిగి ఉండటంతో, ఆరోగ్యంపై ఫోకస్ చేయడం, కొత్త అభిరుచులను అలవాటు చేసుకోవడం వంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే ఈ రీసెర్చ్‌లో పాల్గొన్నవారు ఎక్కువగా అమెరికాలో నివసించే తెల్లజాతీయులే. వాళ్ల సంస్కృతి, కుటుంబ వ్యవస్థ భారత్‌తో చాలా భిన్నం. మన దేశంలో పెళ్లికి ఎక్కువగా భావోద్వేగ విలువ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలంగా ఉంటుంది. అందుకే ఈ రీసెర్చ్‌ను అక్షరాలా భారతీయులపై ప్రయోగించడం కష్టమే.