Gardening Tips: తులసి మొక్క ఎండిపోయిందా? ఈ 4 ప్రధాన కారణాలు అయి ఉండొచ్చు

Tulasi Plant Care: హిందూమతంలో తులసి మొక్క పరమ పవిత్రంగా పూజిస్తారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇళ్లలో తులసి మొక్కను పెట్టుకుని పూజలు చేస్తారు.

Update: 2025-04-07 15:45 GMT
Gardening Tips

Gardening Tips: తులసి మొక్క ఎండిపోయిందా? ఈ 4 ప్రధాన కారణాలు అయి ఉండొచ్చు..

  • whatsapp icon

Tulasi Plant Care: ప్రతి హిందూ ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది. పరమ పవిత్రంగా లక్ష్మీదేవిగా పరిగణించి పూజిస్తారు. అయితే తులసి మొక్క ఒక్కోసారి ఎండిపోతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే వాస్తు ప్రకారం తులసి మొక్క ఎండిపోతే అశుభంగా పరిగణిస్తారు. అయితే తులసి మొక్క ఎండిపోయిన వెంటనే కొత్త మొక్కను తెచ్చి పెట్టుకోవాలి. ఇలా కాకుండా తులసి మొక్క ఎండిపోతే దానికి ప్రధానంగా నాలుగు కారణాలు కావచ్చు అవి ఏంటో తెలుసుకుందాం..

తులసి మొక్కకు సరిపోయినంత కంటే ఎక్కువగా నీళ్లు పోయడం.. లేకపోతే నీళ్లే పోయకపోవడం వల్ల కూడా వాడిపోతుంది. అతిగా నీళ్లు పోయకూడదు. మరి తక్కువగా పోయకూడదు. ఆ మట్టి తడిగా ఉండేలా చూసుకోవాలి.. లేకపోతే మొక్క బలహీనంగా మారిపోయి మాడిపోతుంది.

తులసి మొక్క పెట్టుకున్న కుండలోని మట్టి పై ప్రాంతంలో ఎండిపోయినప్పుడు నీటిని పోయాలి. అయితే ఎండాకాలం ప్రతిరోజు నీళ్లు ఇవ్వాలి. ఇక చలికాలం వర్షాకాలం రెండు మూడు రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది.

అంతేకాదు తులసి మొక్కను నీడ ఎక్కువగా ఉండే ప్రాంతంలో పెడితే అది పెరగకుండా ఉంటుంది. ఎండలో మాత్రమే తులసి మొక్కను పెట్టాలి. ప్రతిరోజు దానికి కనీసం నాలుగు గంటల సన్ లైట్ అయిన అవసరమవుతుంది. ఇంటి బాల్కనీలో ఏర్పాటు చేసుకుంటే ఎండ పడేలా జాగ్రత్తలు తీసుకోండి.

ఇక తులసి మొక్క పెట్టుకున్న మట్టి కుండ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. బాటమ్ లోతుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రెయిన్‌ వ్యవస్థ ఎలా ఉందో చూసుకోండి. నీళ్లు పోస్తే సులభంగా బయటికి వెళ్లిపోయాలే ఉండాలి. మట్టి కూడా నీళ్లను పీల్చుకునేలా ఉండాలి. అక్కడే నీళ్లు అలాగే ఉండిపోతే తులసి మొక్క ఎండిపోతుంది.

ఎప్పటికప్పుడు తులసి మొక్కను కట్ చేస్తూ ఉండాలి. ట్రిమ్మింగ్ చేయటం వల్ల కూడా మళ్లీ బలంగా పెరుగుతాయి. ఆకులను జాగ్రత్తగా కట్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల తులసి మొక్క మరింత గుబురుగా పెరుగుతుంది.

Tags:    

Similar News