Papaya mask: బొప్పాయితో ఈ మాస్క్ వేసుకుంటే గోల్డెన్ గ్లో.. సన్ డ్యామేజ్, పిగ్మెంటేషన్‌కు బైబై..
Papaya Mask For Glow: బొప్పాయి ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా దీంతో ఫేస్ మాస్క్ వేసుకుంటే మెరిసే బంగారు వర్ణంలోని చర్మం మీ సొంతం.

Papaya mask: బొప్పాయితో ఈ మాస్క్ వేసుకుంటే గోల్డెన్ గ్లో.. సన్ డ్యామేజ్, పిగ్మెంటేషన్‌కు బైబై..
Papaya Mask For Glow: పండ్లతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా మీ సొంతమవుతుంది. వీటితో ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల ఇందులో ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు ఉంటాయి. ఇది చర్మానికి మంచి పోషణ అందిస్తుంది. మీ చర్మం మృదువుగా మారిపోవడమే కాదు గోల్డెన్ గ్లో కూడా పొందుతారు. ఈరోజు బొప్పాయితో వేసుకునే మాస్క్ గురించి తెలుసుకుందాం.
బొప్పాయి, పెరుగు కలిపి మాస్క్ వేసుకోవటం వల్ల ముఖానికి గోల్డెన్ గ్లో వస్తుంది. దీనికి పండిన బొప్పాయి గుజ్జును తీసుకొని అందులో కాస్త పెరుగు వేసి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మాస్కును ముఖం, మెడ భాగంలో అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. దీంతో మీ చర్మానికి సహజసిద్ధంగా ఎక్స్‌ఫోలియేషన్ అయిపోతుంది.
బొప్పాయి గుజ్జును తీసుకొని అందులో కొద్దిగా పెరుగు, తేనె వేసి ముఖమంతా అప్లై చేయండి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. 20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేయాలి.
బొప్పాయి, పసుపు కలిపి మాస్క్ వేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. పండిన బొప్పాయి గుజ్జులో కాస్త పసుపు వేసి ముఖమంతా అప్లై చేయండి ఓ అరగంట తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇది మాత్రమే కాదు బొప్పాయి గుజ్జులో కాస్త నిమ్మరసం వేసి ముఖానికి మాస్క్ వేసుకోవాలి. ఇందులో కావాలంటే పెరుగు కూడా కలపవచ్చు. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి నేచురల్ గ్లో ఇస్తుంది. ఇందులో బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. నల్ల మచ్చలను తొలగిస్తుంది. ఈ ఫేస్ మాస్క్ వేసుకున్న తర్వాత పది నిమిషాలకు ఫేస్ వాష్ చేసుకోవాలి.
అయితే ఏ పదార్థం ముఖంపై ఉపయోగించినా.. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాతనే ముఖమంతా అప్లై చేయాలి. ఎందుకంటు కొంత మందికి అలర్జీ సమస్యలు ఉంటాయి. ప్రధానంగా బొప్పాయిలో పప్పైన్ ఉంటుంది. ఇది వారి చర్మంపై మరింత సున్నితంగా పనిచేస్తుంది. ఇది పవర్‌ఫుల్ ఎంజైమ్ వారికి ప్రమాదం. ఇది మాత్రమే కాదు కొంతమందికి నిమ్మరసం కూడా సున్నితంగా చర్మంపై మారిపోతుంది. దీంతో హైపర్ పిగ్మెంటేషన్ సమస్యలు కూడా వస్తాయి.