Sesame Seeds: తెల్ల నువ్వులు ఒక చెంచా తినడం వల్ల 5 ఆరోగ్యం ప్రయోజనాలు తెలుసా?

Sesame Seeds Health benefits: ప్రతిరోజు ఒక చెంచా తెల్ల నువ్వులు తింటే 5 అద్భుతమైన ప్రయోజనాలు తెలుసా ? అవును ఇది నిజమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

Update: 2025-03-31 01:30 GMT

Sesame Seeds: తెల్ల నువ్వులు ఒక చెంచా తినడం వల్ల 5 ఆరోగ్యం ప్రయోజనాలు తెలుసా?

Sesame Seeds Health benefits: తెల్ల నువ్వులు ప్రతి వంటగదిలో అందుబాటులో ఉంటాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటితో నువ్వుల లడ్డూ తయారు చేసుకుంటారు. మనం తయారు చేసుకునే రిసిపీలో వినియోగించవచ్చు. అయితే తెల్ల నువ్వులు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం..

ప్రతిరోజు మీ డైట్ లో తెల్ల నువ్వులు ఒక చెంచా చేర్చుకోవడం వల్ల అనేక పోషకాలు అందుతాయి. సరైన జీవనశైలి అవలంబిస్తూ ఇలాంటి పోషకాహారం అయిన ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.

ప్రధానంగా తెల్ల నువ్వుల మెగ్నీషియం, రాగి, జింక్, సెలీనియం, ప్రోటీన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ బి1 కూడా ఇందులో ఉంటుంది. ఫైబర్ కూడా పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తెల్ల నువ్వులు డైట్లో చేర్చుకోవడం మహిళలకు వరం.

ఇందులో ఉండే కాల్షియం వల్ల ఎముకలను బలపరుస్తుంది. తెల్ల నువ్వులు తరచూ తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. కీళ్ల నొప్పులు రాకుండా కాపాడుతుంది. పిల్లలకు తెల్ల నువ్వులను లడ్డూ తయారు చేసి కూడా ఇవ్వచ్చు.

తెల్ల నువ్వులలో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు ఒక చెంచా నువ్వులు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మీ కడుపు శుభ్రమైపోతుంది ఆరోగ్యకరమైన పేగు కదలికలకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

తెల్ల నువ్వులు తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, మెగ్నీషియం ఉంటుంది. బలహీనత త్వరగా తగ్గిపోతుంది. మహిళలు బెల్లం కలిపి నువ్వులు తీసుకోవడం వల్ల రక్తం పెరుగుతుంది, తక్షణ శక్తి అందుతుంది.

ఇక తెల్ల నువ్వులను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇది ట్రిప్టోఫాన్ ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. ఇందులో మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి మంచి ఉపశమనం కలిగిస్తుంది. నువ్వులు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడతారు. నిద్రలేమి సమస్యకు కూడా చెక్ పెడుతుంది.

అంతే కాదు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు తెల్ల నువ్వులు కచ్చితంగా తీసుకోవాలి. ఇది ఒబేసిటీని తగ్గిస్తుంది. ఇందులో ఎక్కువ మోతాదులో ఫైబర్ ఉంటుంది. కాబట్టి బరువు నియంత్రిస్తుంది.

Tags:    

Similar News