Muskmelon: పుచ్చకాయ మాత్రమే కాదు.. ఈ పండులో దానికి మించిన పోషకాలు..
Muskmelon Health Benefits: ఎండాకాలం వచ్చిందంటే మార్కెట్‌లో నీటి శాతం అధికంగా ఉండే పండ్లకు ప్రాధాన్యత ఇస్తాం. అందుకే పుచ్చకాయ వంటివి డైట్‌లో చేర్చుకుంటాం.
Muskmelon: పుచ్చకాయ మాత్రమే కాదు.. ఈ పండులో దానికి మించిన పోషకాలు..
Muskmelon Health Benefits: ఎండాకాలం మార్కెట్‌లో పుచ్చకాయ, మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. పుచ్చకాయలు నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది మంచి హైడ్రేషన్ అందిస్తుంది. అయితే పుచ్చకాయతో పాటు మార్కెట్లో మరో పండు కూడా అందుబాటులో ఉంటుంది. అదే కర్భుజా పండు. పసుపు రంగులో కనిపించే ఈ పండులో పోషకాలు పుష్కలం. లోపల విత్తనాలు కూడా పసుపు రంగులో ఉంటాయి. ఇందులో కూడా అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. వీటిని ఎండబట్టి తింటారు. అయితే నీటి శాతం అధికంగా ఉండే కర్బూజాలో తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..
కర్బుజా దీన్ని మస్క్ మిలాన్ అని ఇంగ్లీషులో పిలుస్తారు. ఇది కాస్త తక్కువ తియ్యదనంతో ఉంటుంది. కానీ హైడ్రేషన్ పుష్కలంగా అందిస్తుంది. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు పుష్కలం. పోషకాలు కూడా ఉంటాయి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
రెగ్యులర్‌గా ఈ కర్బూజా తీసుకోవడం వల్ల మనకు తక్షణంగా శక్తి అందుతుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇస్తుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటుంది. దీంతో ఇది రొంప సమస్యలను కూడా తగ్గిస్తుంది. మీ సీజనల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది.
వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్లు కర్బూజాను డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో విటమిన్స్, మినరల్స్ ఉండడం వల్ల మంచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఎక్కువగా సమయం పాటు కడుపు నిండున అనుభూతి కలుగుతుంది. దీంతో అతిగా ఆకలి వేయదు. తినకుండా ఉంటారు బరువు తగ్గుతారు.
అంతేకాదు కర్బుజా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఇందులో ఫైబర్ పొటాషియం ఉంటుంది. రక్తపోటు నిర్వహిస్తుంది.దీంతో ఆడియో ఆరోగ్యం కూడా బాగుంటుంది.
కర్బుజాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు మంట సమస్యను తగ్గిస్తుంది. ఇక కర్పూజ ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా తోడ్పడుతుంది. ఇది కుదుళ్లను ఆరోగ్యానికి సహాయపడుతుంది. ముఖ్యంగా సెబమ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మంచి పోషకాలు లభిస్తాయి, జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది.
కర్బుజా తీసుకోవడం వల్ల డయాబెటిస్ నివారిస్తుంది. రక్తంలో షుగర్ పెరగకుండా కాపాడుతుంది. ఇందులో ఆక్సీకిన్ ఉండటం వల్ల డయాబెటిస్ రోగులకు మేలు జరుగుతుంది. అంతే కాదు ఇందులో గ్లైసెమిక్ సూచీ కూడా తక్కువగా ఉంటుంది. డయాబెటిస్లతో బాధపడుతున్న వారు కర్బూజా పండును తీసుకోవచ్చు.