Henna: హెన్నా హెయిర్ ప్యాక్‌ను ఇలా ఇంట్లోనే సరిగ్గా కలిపి వేసుకోవడం తెలుసా?

Henna Mixing: జుట్టు తెల్లబడినప్పుడు హెన్నా హెయిర్ ప్యాక్ ఉపయోగిస్తారు. దీన్ని జుట్టు అంతటికీ అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది.

Update: 2025-04-04 20:08 GMT
Henna

Henna: హెన్నా హెయిర్ ప్యాక్‌ను ఇలా ఇంట్లోనే సరిగ్గా కలిపి వేసుకోవడం తెలుసా?

  • whatsapp icon

Henna Mixing: మనలో చాలామందికి హెన్నా హెయిర్ ప్యాక్ ఇంట్లో వినియోగించే అలవాటు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి వారంలో ఒక్కసారైనా హెన్నాను జుట్టుకు అప్లై చేస్తారు. తద్వారా తెల్ల జుట్టు సమస్య తగ్గిపోతుంది. తాత్కాలికంగా తెల్ల జుట్టు కవర్ అయిపోతుంది. అంతేకాదు జుట్టులో ఉండే చుండ్రు తొలగిపోయి ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే చాలామందికి ఈ హెన్నా హెయిర్ ప్యాక్ ఇంట్లో సరిగ్గా కలపడం రాదు.. ఈరోజు ఆ ట్రిక్‌ తెలుసుకుందాం.

ఈ కాలంలో చాలా మందికి 20 వయసులోనే తెల్ల జుట్టు సమస్య వేధిస్తుంది. ఇది అతిగా స్ట్రెస్ తీసుకోవడం, కాలుష్యం, కెమికల్ ఉండే హెయిర్ కేర్ ఉత్పత్తులు ఉపయోగించటం వల్ల జరుగుతుంది. అయితే నేచురల్ గా రెమిడీలు ప్రయత్నించాలి. కానీ ఈ కెమికల్స్ ఉండేవి వాడితే తెల్ల జుట్టు సమస్య వేధిస్తుంది.

హెన్నా అనేది ఒక నేచురల్ డై అని చెప్పొచ్చు. ఇది జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుస్తుంది. అంతేకాదు నల్లగా మారుస్తుంది. దీంతో కొన్ని ఉత్పత్తులు కలిపి ఉపయోగిస్తారు. సహజసిద్ధంగా జుట్టు నలుపు రంగులోకి మారిపోతుంది.

ఒక కప్పు హెన్నా పౌడర్‌లో అరకప్పు ఉసిరి పొడి, ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి వేయాలి. మీ జుట్టు మరింతగా నలుపు రంగులోకి మారుతుంది. ఇప్పుడు ఇందులో సన్న మంటపై ఉడకబెట్టిన బ్లాక్ టీ లేదా వేడినీళ్ళను పోయాలి.. ఉండలు కట్టకుండా మెత్తని పేస్టులా కలపాలి.. అయితే దీన్ని ఒక ఇనుప పాత్రలో కలుపుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఎక్కువ రోజులపాటు నలుపు రంగులోనే ఉంటుంది. కలిపి రాత్రంతా అలాగే వదిలేయండి. అయితే మీరు అప్లై చేసుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ ఇండిగో పౌడర్ ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి.

ఆ తర్వాత ఈ హెన్నా పేస్టును జుట్టు అంతటికీ కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసి మూడు గంటల పాటు ఆరనివ్వండి. ఇప్పుడు సాధారణ నీటితో జుట్టును కడగాలి, షాంపూ వినియోగించకూడదు. మీరు కచ్చితంగా షాంపూ చేసుకోవాల్సి వస్తే మైల్డ్‌ షాంపూను మాత్రమే ఉపయోగించండి అది కూడా 24 గంటల తర్వాత.

Tags:    

Similar News