Ash Gourd: ఈ జ్యూస్ ఒక గ్లాసు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.. జీవితంలో షుగర్ రాదు

Ash Gourd for Stones: ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం ఆరోగ్యకవంతమైంది ఉండాలి అయితే ఈ కాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగానే ఉన్నారు.

Update: 2025-04-05 02:30 GMT
Ash Gourd

Ash Gourd: ఈ జ్యూస్ ఒక గ్లాసు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.. జీవితంలో షుగర్ రాదు

  • whatsapp icon

Ash Gourd for Stones: బూడిద గుమ్మడికాయ ఇది కేవలం దిష్టికి మాత్రమే కడతారు అంటే అది పప్పులో కళేసినట్లే. బూడిద గుమ్మడికాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటితో మన శరీరానికి కావలసిన హైడ్రేషన్ అందిస్తుంది. ఎండాకాలం బూడిద గుమ్మడికాయ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కిడ్నీలో రాళ్లను సైతం ఇవి తక్షణమే కరిగిపోతాయి. అంతేకాదు మనకు ఎండాకాలంలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.

తెలుపు రంగులో ఉండే బూడిద గుమ్మడికాయ రసం తాగడం వల్ల మన శరీరంలో ఉండే విష పదార్థాలు కూడా బయటికి పోతాయి. ఇది శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే బూడిద గుమ్మడికాయలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రిస్తాయి. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి ఇది మంచి జ్యూస్ అని చెప్పవచ్చు.

అంతేకాదు బూడిద గుమ్మడికాయ తీసుకోవడం వల్ల ఇందులో పొటాషియం ఉంటుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. జీర్ణ క్రియను మెరుగు చేస్తుంది. తెల్ల గుమ్మడికాయ రసం డైట్లో చేర్చుకుంటే జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. కడుపులో యాసిడిటీ, మలబద్ధకం సమస్య కూడా చెక్‌ పెట్టొచ్చు.

ఈ కాయ జ్యూస్‌ డైట్‌లో చేర్చుకోవడం వల్ల బలహీనత నుంచి బయటపడతారు. తక్షణ శక్తి అందిస్తుంది. ఈ రసం డైట్ లో చేర్చుకుంటే ఇందులో ఉన్న కాల్షియం, జింక్ నీరసాన్ని తొలగిస్తుంది.

ఇది చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. బూడిద గుమ్మడి కాయలో యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోవడం వల్ల చర్మం నిత్య యవ్వనంగా కనిపిస్తుంది. ముఖంపై ఉండే మచ్చలు, గీతాలు కూడా తొలగిపోతాయి. ఉదయం పరగడుపున ఈ జ్యూస్‌ తీసుకోవడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లు కరిగిపోతాయి మంచి ఉపశమనం కలుగుతుంది.

Tags:    

Similar News