Belly Fat: ఈ పండు తింటే ఎంతటి కొండలాంటి బెల్లీ ఫ్యాట్ అయినా కరిగిపోవాల్సిందే..!
Belly fat Burning Fruits: సమతుల ఆహారం తీసుకుంటూ, రెగ్యులర్‌గా ఎక్సర్ సైజ్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. అయితే కొన్ని రకాల పండ్లు కూడా బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగించేస్తాయి.
Belly fat Burning Fruits: శరీరానికి కావాల్సిన ఖనిజాలు తీసుకోవడం ఎంతో మంచిది. ఇది మెటాలిజం రేటును పెంచుతుంది. అయితే కొన్ని రకాల పండ్లు డైట్లో చేర్చుకోవడం వల్ల ఖనిజాలు ఉండటమే కాదు బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గించేస్తుంది. అవును అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
గ్రేప్స్..
గ్రేప్స్ వివిధ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ఈ పండ్లు డైట్లో చేర్చుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది. ఈ గ్రేప్స్ ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించేస్తాయి. అంతేకాదు ఇది వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు తీసుకుంటే మంచి ఆరోగ్యకరం. త్వరగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బెర్రీ పండ్లు..
బెర్రీ జాతికి చెందిన పండ్లు బ్లూబెర్రీ, స్ట్రాబెరీ, రాస్బెర్రీలు వంటి డైట్‌లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. తద్వారా మెటబాలిజం రేటును కూడా పెంచుతాయి. దీంతో బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గిపోతుంది.
పుచ్చకాయ..
పుచ్చకాయ నీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఎండాకాలం విరివిగా అందుబాటులో ఉంటాయి. అయితే ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. ఇది రోజంతా నీకు కావలసిన హైడ్రేషన్ మనకు అందిస్తుంది. అంతేకాదు కడుపునిండా అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా బరువు పెరగకుండా ఉంటారు.
పైనాపిల్..
పైనాపిల్ పండులో ముఖ్యంగా బ్రోమాలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు చేస్తుంది. కడుపులో గ్యాస్ అజీర్తిని తగ్గిస్తుంది. ప్రధానంగా ఇందులో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల కడుపు నిండన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది. తద్వారా బరువు పెరగకుండా ఉంటారు.
ఆవకాడో..
ఆవకాడలో కూడా క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ కూడా ఉంటాయి. తద్వారా ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. బరువు పెరగకుండా ఉంటారు.
కీవీ..
కీవీ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ సీ తోపాటు ఫైబర్ కూడా ఉంటుంది .ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. రెగ్యులర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది. అంతేకాదు ఇది వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి మంచిది.
యాపిల్ పండ్లు ..
యాపిల్‌లో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. యాపిల్ తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వారు యాపిల్ తీసుకోవాలి. ఇవి మాత్రమే కాదు కొన్ని రకాల పియర్, ఆరెంజ్, బొప్పాయి, లెమన్ వంటివి కూడా డైట్లో చేర్చుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు.