Health: అకస్మాత్తుగా బీపీ ఎందుకు పెరుగుతుంది.? ఇవి కూడా కారణాలని తెలుసా..!
Health: ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న అనారోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి.

Health: అకస్మాత్తుగా బీపీ ఎందుకు పెరుగుతుంది.? ఇవి కూడా కారణాలని తెలుసా..!
Health: ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న అనారోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది బీపీతో బాధపడుతున్నారు. అయితే బీపీని సరైన సమయంలో నియంత్రించకపోతే గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి, రక్తపోటు పెరగడానికి కారణాలు ఏంటి? దాన్ని తగ్గించడానికి ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తపోటు ఎందుకు పెరుగుతుంది?
రక్తపోటు పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో అధిక ఒత్తిడి, క్రమరహిత జీవనశైలి, అధిక ఉప్పు తీసుకోవడం, ధూమపానం, మద్యం వంటి చెడు అలవాట్లు, అధిక బరువు లేదా ఊబకాయం శారీరక శ్రమ పూర్తిగా తగ్గడం, ఒకేచోట గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వంటి వాటి వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే జీవన విధానంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవడం వల్ల అధిక రక్తపోటును కంట్రోల్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
ఉప్పులో ఉండే సోడియం, రక్తపోటు పెరగడానికి ప్రధాన కారణం. కాబట్టి రోజువారీ ఆహారంలో తక్కువ ఉప్పును మాత్రమే వినియోగించండి. తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా చేర్చండి
బాలన్స్‌డ్ డైట్‌లో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు ఉండేలా చూసుకోండి. ఇవి రక్తపోటును నియంత్రించడమే కాకుండా గుండెకు మంచివి. ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు కలిగిన ఆహారం, ఉదాహరణకు అవకాడో, వేరుశెనగలు, మినప్పప్పు గింజలు, చేపలు వంటివి తీసుకోవడం వల్ల మంచి కొవ్వులు శరీరానికి అందుతాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
రోజూ కనీసం 30 నిమిషాలు తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా, రక్తపోటు స్తాయిలు సాధారణంగా ఉంచే అవకాశముంది. రోజుకి 7–8 గంటల నిద్ర అవసరం. మంచి నిద్ర వల్ల హార్మోన్ల సమతుల్యత ఉంటుంది. ఇది రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి కచ్చితంగా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకునేందుకు కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పై సూచనలు ప్రాథమిక ఆరోగ్య సూచనలుగా మాత్రమే తీసుకోవాలి. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోండి.