Lifestyle: విటమిన్లు ఎక్కువైనా నష్టం తప్పదా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Lifestyle: ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్లు అవసరం. ఇవి శరీరాన్ని బలపరుస్తాయి. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

Lifestyle: విటమిన్లు ఎక్కువైనా నష్టం తప్పదా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Lifestyle: ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్లు అవసరం. ఇవి శరీరాన్ని బలపరుస్తాయి. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. అయితే, అవసరానికి మించి విటమిన్లు తీసుకోవడం హానికరమని మీకు తెలుసా.? దీనివల్ల హైపర్‌కాల్సెమియా అనే ప్రమాదకరమైన వ్యాధి ఏర్పడవచ్చు. ముఖ్యంగా విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల ఈ సమస్య పెరుగుతుంది. ఇంతకీ హైపర్‌కాల్సెమియా అంటే ఏంటి.? ఈ సమస్య నుంచి ఎలా బయట పడొచ్చు.? ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తంలో అధిక కాల్షియం స్థాయి హైపర్‌కాల్సెమియా కారణమవుతుంది. శరీరానికి అవసరమైన పరిమాణాన్ని మించి కలిగిన కాల్షియంను శరీరం ఉపయోగించుకోలేదు. దీంతో అనేక సమస్యలు తలెత్తుతాయి. తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం, దాహం ఎక్కువగా వేయడం, నాడీ వ్యవస్థపై ప్రభావం వంటి సమస్యలు ఎదురవుతాయి.
హైపర్‌కాల్సెమియా వల్ల కలిగే సమస్యలు:
హైపర్‌కాల్సెమియాను రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఎముకలు దెబ్బతినడం, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం, మూత్రపిండాల పనితీరు తగ్గిపోవడం, గుండె సంబంధిత వ్యాధులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
హైపర్‌కాల్సెమియాకు కారణాలు:
వైద్యుని సూచన లేకుండా అధిక విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవడం. విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం. విటమిన్ డి పొందడానికి ఎక్కువసేపు ఎండలో ఉండడం వంటివి కారణాలుగా చెప్పొచ్చు.
ఈ సమస్యను ఎలా గుర్తించాలి.?
వాంతులు, వికారం, అలసట, శరీర బలహీనత, విపరీతమైన దాహం వేయడం, తరచూ మూత్ర విసర్జన, కిడ్నీలో రాళ్లు, ఆకలి తగ్గడం, కడుపు నొప్పి, బరువు తగ్గడం వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా చెప్పొచ్చు. హైపర్‌కాల్సెమియా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుని అనుమతి లేకుండా విటమిన్-కాల్షియం సప్లిమెంట్లు తీసుకోవద్దు. అధిక విటమిన్లు కలిగిన ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి. ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు.
గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సంబంధిత విషయాల్లో వైద్యుల సలహా తీసుకోవడం ఎంతో అవసరం.