Indian Foods: ఈ 7 భారతీయ వంటకాలు మనకు తెలియకుండానే బరువు పెంచేస్తాయి

Indian Foods Leads To Obesity: మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండాలే, క్యాలరీలు తక్కువగా ఉండేటా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా బరువు పెరగకుండా ఉంటారు. అయితే ఈ భారతీయ వంటకాలు తీసుకోవడం వల్ల బరువు పెరిగిపోతారు.

Update: 2025-04-04 17:00 GMT
Indian Foods

Indian Foods: ఈ 7 భారతీయ వంటకాలు మనకు తెలియకుండానే బరువు పెంచేస్తాయి

  • whatsapp icon

Indian Foods Leads To Obesity: మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండాలే, క్యాలరీలు తక్కువగా ఉండేటా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా బరువు పెరగకుండా ఉంటారు. అయితే ఈ భారతీయ వంటకాలు తీసుకోవడం వల్ల బరువు పెరిగిపోతారు.

రైస్..

వైట్ రైస్ మన దేశంలో ఎక్కువ మోతాదులో తీసుకుంటారు. ఇది రిఫైండ్ కార్బోహైడ్రేటు, తక్కువ మొత్తంలో ఫైబర్ మాత్రమే ఉంటుంది. అయితే అతిగా వైట్‌ రైస్ తీసుకోవడం వల్ల బరువు సులభంగా పెరిగిపోతారు. ప్రధానంగా రాత్రి పూట అధిక బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఇది మెటబాలిజం రేటును కూడా నెమ్మదించేలా చేస్తుంది. తద్వారా ఫ్యాట్ కూడా నిలిచిపోతుంది. రాను రాను బరువు పెరిగిపోతారు.

నెయ్యితో కూడిన చపాతీలు..

గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలు ఆరోగ్యకరమే. రైస్‌కు బదులుగా రోటీలు తీసుకుంటారు. అయితే ఇందులో ఎక్కువ మొత్తంలో నెయ్యి వేసుకొని తీసుకోవటం వల్ల క్యాలరీల మోతాదు పెరుగుతుంది. తద్వారా బరువు పెరిగిపోయే అవకాశం ఉంది. అయితే ఈ చపాతీలు తిన్న తర్వాత కాస్త ఫిజికల్ యాక్టివిటీ చేయాలి.

పప్పులు, కూరలు..

భారతీయ వంటలో పప్పులు, కూరగాయలకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇందులో ఎక్కువ మోతాదులో నూనె, బట్టర్, క్రీమ్ వేసి తీసుకోవటం వల్ల క్యాలరీలో మోతాదు పెరిగిపోతుంది. అంటే దాల్ మఖానిలో ఎక్కువ మోతాదులో ఫ్యాట్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. తద్వారా బరువు పెరిగిపోతారు రాత్రి సమయంలో తీసుకుంటే ఒబేసిటీకి దారితీస్తుంది.

పనీర్ బటర్ మసాలా..

పనీర్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ పనీర్‌ను బట్టర్ మసాలాతో తయారు చేసుకుని తీసుకోవడం వల్ల ఇందులో శాచ్యురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఎక్కువ మోతాదులో బట్టర్, క్రీమ్ వేసి తయారు చేస్తారు. అంతే కాదు ఇందులో జీడిపప్పు పేస్టు కూడా వాడతారు. తద్వారా క్యాలరీల మోతాదు ఎక్కువగా పెరిగిపోతుంది. దీన్ని రాత్రి సమయంలో తింటే కొవ్వు పేరుకుపోయి బరువు పెరిగిపోతారు


బిర్యానీ, పులావ్..

బిర్యానీ, పులావ్‌లలో కూడా ఎక్కువ మోతాదులో బియ్యం తయారు చేస్తారు. వీటిలో ఎక్కువ నెయ్యి ఇతర మసాలాలు వేసి తయారు చేస్తారు. కాబట్టి రాత్రి సమయంలో తీసుకుంటే ఒబెసిటీ కి దారితీస్తుంది.

స్నాక్స్..

చాలామంది రాత్రి సమయంలో ఏదైనా డిన్నర్ తో పాటు ఫ్రై చేసిన స్నాక్స్ తీసుకునే అలవాటు ఉంటుంది. అలా పకోడీ, సమోసా వంటివి తీసుకుంటారు. ఇందులో ట్రాన్స్‌ ఫ్యాట్‌ కలిగి ఉంటుంది. డీప్ ఫ్రై చేస్తారు కాబట్టి మెటబాలిజం రేటుని తగ్గిస్తుంది. దీంతో కొవ్వు మన శరీరంలో పేరుకుపోతుంది. రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల బరువు కూడా పెరుగుతారు.

ఫుల్ ఫ్యాట్ మిల్క్..

ఈ ఫుల్ ఫ్యాట్‌ మిల్క్ లేదా లస్సీ రాత్రి సమయంలో తీసుకుంటే బరువు పెరుగుతారు. ఇందులో ఎక్కువ మోతాదులో ఫ్యాట్ ఉంటుంది. అయితే అతిగా తీసుకోవడం వల్ల మన శరీరంలో కొవ్వు పేరుకు పోతుంది. దీంతో పాటు ఇతర హెవీ ఉండే ఆహారాలు తీసుకుంటే మరింత ప్రమాదం.

ఫ్రైడ్ రైస్, నూడుల్స్

ఈ ఇండో చైనీస్ నూడుల్స్ అంటే చాలామందికి ఇష్టం. ప్రధానంగా హక్కా నూడుల్స్, ఫ్రైడ్ రైస్ దీన్ని రీఫైండ్‌ పిండితో అతిగా నూనె ఉపయోగించి సోడియం సాస్‌లు ఉపయోగించి తయారు చేస్తారు. కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెంచుతాయి. అంతే కాదు ఒబేసిటీకి కూడా దారితీస్తుంది. తరచూ డిన్నర్‌లో తింటే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదం.

Tags:    

Similar News