Weight Loss: నో జిమ్‌.. నో స్ట్రెస్‌.. ఈ చిన్న అలవాటు ఉంటే నెలలో 5 కేజీలు ఇట్టే తగ్గిపోతారు..

Weight Loss Tricks: బరువు తగ్గాలనుకునేవారు పెద్ద బరువులు ప్రతిరోజూ ఎత్తాల్సిన పనిలేదు. ఈ చిన్న అలవాటు ఉంటే త్వరగా బరువు తగ్గిపోతారు.

Update: 2025-04-05 05:30 GMT

Weight Loss: నో జిమ్‌.. నో స్ట్రెస్‌.. ఈ చిన్న అలవాటు ఉంటే నెలలో 5 కేజీలు ఇట్టే తగ్గిపోతారు..

Weight Loss Tricks: మీరు చేస్తున్న పనిచోట ప్రతిసారి లేవడం కూర్చోవడం వంటివి చేస్తూ ఉండాలి. అంతేకాదు అటు ఇటు తిరుగుతూ ఉంటే మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. తద్వారా బరువు కూడా తగ్గిపోతారు. ఎక్కువ మోతాదులో మీరు వర్కౌట్ కూడా చేయాల్సిన పనిలేదు. ఇలాంటి చిన్న అలవాట్లు చేసుకుంటూ ఉండాలి. అంటే ఒక్కోసారి లిఫ్ట్‌కు బదులుగా మెట్లను ఉపయోగించండి.

అంతేకాదు ప్రతిరోజు ఉదయం లేదా ఉన్నచోటనే పది నిమిషాల పాటు పుష్ అప్‌, స్కౌట్‌ వంటివి స్నానం చేసే ముందు చేయాలి. ఇలా చేయటం వల్ల బరువు త్వరగా తగ్గిపోతారు.

మీ డైట్‌లో షుగర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు. దానికి బదులుగా గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ వంటివి డైట్లో చేర్చుకోవాలి. ఇలాంటి చిన్న మార్పులు చేసుకున్న కానీ బరువు ఈజీగా తగ్గిపోతారు.

అంతేకాదు మీరు తీసుకునే ఆహారం కూడా చిన్న మొత్తంలో ఎక్కువసార్లు తీసుకోవాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుకోని తినకూడదు. చిన్న ప్లేట్ ఎంపిక చేసుకోండి. దీంతో మీరు కడుపునిండా తిన్న ఫీలింగ్‌ ఉంటుంది.

అతిగా క్యాలరీలు ఉండే డ్రింక్స్ తీసుకోకూడదు. అంటే జ్యూసులు వంటి వాటికి దూరంగా ఉండాలి. బదులుగా స్మూథీ, చక్కెర లేని డ్రింక్స్ మాత్రమే తీసుకోండి.

మీరు అధిక మోతాదులో నీరు తీసుకోవాలి. ప్రతిరోజు దాహం వేయకున్నా నీళ్లు తీసుకునే అలవాటు చేసుకోవాలి. తద్వారా కడుపు నిండిన అనుభూతి కూడా కలుగుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది.

పనిచేసిన చోటే ఎక్కువ సమయం పాటు ఉండకుండా ప్రతి గంటకు ఓ 60 సెకండ్ల పాటు అటూ ఇటూ తిరగడం అలవాటు చేసుకోండి. దీంతో మీ బ్లడ్ సర్క్యూలేషన్ కూడా మెరుగవుతుంది. క్యాలరీలు కూడా కరిగిపోతాయి.

వారానికి కనీసం మూడుసార్లు అయినా ఏవైనా బరువులు ఎత్తడం అలవాటు చేసుకోవాలి. తద్వారా సులభంగా వెయిట్ లాస్ అవుతారు. అతిగా ఆకలి వేసినప్పుడు క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. కూరగాయలు అతిగా ఉండే సలాడ్స్ మాత్రమే తీసుకోండి. తద్వారా బరువు పెరగకుండా ఉంటారు.

Tags:    

Similar News