Curd: ప్రతిరోజు పెరుగు తినడం వల్ల 7 లాభాలు తెలుసా?
Curd Health Benefits: పెరుగు మంచి ప్రోబయోటిక్. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికకు తోడ్పడుతుంది. ప్రతిరోజు పెరుగు తినడం వల్ల బోలెడు లాభాలు తెలుసా?

Curd: ప్రతిరోజు పెరుగు తినడం వల్ల 7 లాభాలు తెలుసా?
Curd Health Benefits: మన రెగ్యులర్ డైట్‌లో పెరుగు చేర్చుకోవడం ఎంతో ఆవశ్యకం. ఇది పాలతో తయారుచేస్తారు. పెరుగు తీసుకోవడం వల్ల కడుపులో మంచి బ్యాక్టీరియా పెరిగేలా ప్రేరేపిస్తుంది. ఎండాకాలం పెరుగు, మజ్జిగ తీసుకోవడం తప్పనిసరి. ఇందులో కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ప్రతిరోజు పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
పెరుగు తీసుకోవడం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. రక్త పోటును అదుపులో ఉంచుతుంది. పెరుగు కార్డియో ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది.
రెగ్యులర్ డైట్‌లో పెరుగు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ మన ఎముకలకు మేలు చేస్తుంది. ఎముకల సామర్థ్యాన్ని పెంచుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) తెలిపింది. పెరుగు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మీ ఎముకలతో పాటు పళ్లు బలంగా మారుతాయి. ఆస్టీయోపోరోసిస్ నుంచి దూరంగా ఉంటారు.
వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవాళ్లు పెరుగు తీసుకోవాలని ఇది ఒబేసిటీ తగ్గిస్తుంది. మెటబాలిజం రేటును ఇది పెంచుతుంది. కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇందులో ప్రోటీన్ పుష్కలం. కాబట్టి కడుపుని అనుభూతి అందిస్తుంది. తద్వారా అతిగా తినకుండా ఉంటారు.
జీర్ణ ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు పెరుగులో ఉంటాయి. ఇందులో మంచి బ్యాక్టీరియా ప్రేరేపించే గుణం ఉంటుంది. దీంతో జీర్ణశయానికి మెరుగవుతుంది. గ్యాస్ సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. రెగ్యులర్‌గా పెరుగు తీసుకోవడం వల్ల కడుపులో దీర్ఘకాలిక మలబద్దక సమస్యకు మంచి రెమిడీ.
ఇమ్యూనిటీని బూస్టింగ్ ఇచ్చే గుణాలు ఇందులో ఉన్నాయి. పెరుగును డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఇది ఇమ్యూనిటీ బలపరిచి, సీజనల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది.
ఆరోగ్యకరమైన హెయిర్‌కు పెరుగు తప్పనిసరి. ఇందులో ఖనిజాలు, విటమిన్స్ ఉంటాయి. ఇది జుట్టు ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. హెయిర్ ఫాల్ సమస్య తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టుకు పెరుగు తప్పనిసరి. దీన్ని హెయిర్ ప్యాక్‌లా కూడా వేసుకుంటారు.