Fiber: ఫైబర్ పుష్కలంగా ఉండే 8 కూరగాయలు.. మీ డైట్‌లో ఉన్నాయా మరీ..?
Fiber Rich Foods: ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కడుపు ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు బరువు కూడా పెరగకుండా ఉంటారు.

Fiber: ఫైబర్ పుష్కలంగా ఉండే 8 కూరగాయలు.. మీ డైట్‌లో ఉన్నాయా మరీ..?
Fiber Rich Foods: ఈరోజు ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు జాబితా తెలుసుకుందాం. మనం రోజూ తీసుకునే కూరగాయల్లో ఫైబర్ లభిస్తుంది. వీటిని తీసుకోవటం వల్ల కడుపు ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడి కడుపులో మంచి బ్యాక్టిరియా పెరిగేలా ప్రేరేపిస్తాయి. అయితే ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ 8 ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకుంటే బరువు కూడా పెరగకుండా ఉంటారు.
వంకాయ..
వంకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడతాయి. అంటే కాదు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించేస్తాయి. వంకాయ కూర, మసాలా రూపంలో కూడా తయారు చేసుకుంటారు.
మునగకాయ..
మునగకాయ ఎన్నో రోజుల నుంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఇందులో ఫైబర్, విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది జీర్ణ ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. మునక్కాడతో పప్పు, సాంబార్ లేదా సూప్ రూపంలో తీసుకుంటారు.
క్యాబేజీ..
ఇది మాత్రమే కాదు క్యాబేజీలో కూడా ఫైబర్ ఉంటుంది. ఈ ఎండాకాలం క్యాబేజీని డైట్ లో చేర్చుకోవడం వల్ల కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కడుపు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు క్యాబేజీ డైట్‌లో చేర్చుకోవాలి. క్యాబేజీని కూడా కూర, సలాడ్ రూపంలో తయారు చేసుకుంటారు.
బీట్‌రూట్..
బీట్‌రూట్‌ను కూడా డైట్ లో చేర్చుకోవడం వల్ల కూడా మన శరీరానికి కావాల్సిన ఫైబర్ అందుతుంది. ఇందులో రక్త స్థాయిలను కూడా పెంచే గుణం ఉంటుంది. బీట్‌రూట్ నేరుగా తినవచ్చు. జ్యూస్ రూపంలో తీసుకుంటారు. బీట్‌రూట్ ఆరోగ్యకరమైన పేగు కదలికలకు ఎంతో అవసరం.
పచ్చి బఠానీ..
పచ్చి బఠానీ తీసుకోవడం వల్ల ఫైబర్ అందుతుంది. అంతేకాదు ఇది రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగనివ్వకుండా కాపాడుతుంది. ఈ గ్రీన్ పీస్ కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కల్పిస్తుంది. తద్వారా అతిగా తినకుండా ఉంటారు.
చిలగడదుంప...
చిలగడదుంప డైట్‌లో చేర్చుకోవడం వల్ల కూడా ఇందులో ఫైబర్ మన శరీరానికి అందుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగనివ్వకుండా సహాయపడుతుంది. అంతేకాదు షుగర్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చిలగడదుంప తీసుకోవడం వల్ల తక్షణ శక్తి కూడా అందుతుంది.
పాలకూర..
ఇది మాత్రమే కాదు పాలకూరల్లో కూడా ఖనిజాల పుష్కలం. జీర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి. ఐరన్ పుష్కలంగా ఉండే పాలకూర తీసుకోవడం వల్ల ఫైబర్ కూడా మన శరీరానికి అందుతుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కల్పించడంతోపాటు షుగర్ హఠాత్తుగా పెరగనివ్వకుండా కాపాడుతుంది.