Hairfall: రాత్రి 10 చుక్కల ఈ నూనె తలకు రాసుకుంటే.. జీవితంలో ఎప్పుడు బట్టతలరాదు..

Haitfall Remedy: హెయిర్ ఫాల్ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. ప్రధానంగా ఆరోగ్య సమస్యలు, స్ట్రెస్, కాలుష్యం వల్ జుట్టు రాలుతుంది.

Update: 2025-03-29 15:30 GMT
Hairfall

Hairfall: రాత్రి 10 చుక్కల ఈ నూనె తలకు రాసుకుంటే.. జీవితంలో ఎప్పుడు బట్టతలరాదు..

  • whatsapp icon

Haitfall Remedy: ఈ బిజీ లైఫ్‌లో హెయిర్ ఫాల్ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. ముఖ్యంగా అతిగా స్ట్రెస్ ఇతర ఆరోగ్య సమస్యలు సరైన జీవనశైలి పాటించకపోవడం ప్రధాన కారణం. దీనికి అనేక ఉత్పత్తులు వేలల్లో ఖర్చుపెట్టి మరి ఉపయోగిస్తారు. అయినా సరైన ఫలితాలు ఇవ్వకుండా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి.

బామ్మల కాలం నాటి చిట్కా ఉంది. దీంతో మీ చుట్టూ ఊడిపోదు.. ఆరోగ్యంగా పెరుగుతుంది. చాలామందికి టీనేజ్ వయసు నుంచే హెయిర్ ఫాల్ సమస్య మొదలవుతుంది. వాతావరణ కాలుష్యం, జన్యుపరమైనలోపాలతో పాటు సరైన జీవనశైలి పాటించకపోవడం కూడా కారణం. అయితే ఆయుర్వేదపరంగా మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచే కొన్ని చిట్కాలు ఉన్నాయి.

ఆముదం నూనె మన పూర్వకాలం నుంచి మన బామ్మలు ఆముదం నూనెని ఉపయోగిస్తారు. ఇది జుట్టుకు రాయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారి ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇది జుట్టుకు మంచిది. ఇందులో ఒమేగా 6, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియా ,యాంటీ ఫంగల్ గుణాలు కూడా కలిగి ఉంటాయి.

జుట్టుకు ఆముదం నూనె రాయడం వల్ల కుదుళ్ల నుంచి బలంగా పెరుగుతుంది. అంతేకాదు సహజంగా మీ జుట్టుకు మెరుస్తూ కనిపిస్తుంది. ప్రతిరోజు ఒక పది చుక్కల ఆముదం నూనెను జుట్టు కుదుళ్లకు బాగా అప్లై చేసి మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లలో రక్త ప్రసరణ మెరుగవుతుంది.

జుట్టుపై ఉండే అదనపు చుండ్రును కూడా ఇది గ్రహించేస్తుంది. అంతేకాదు అముదం నూనె తరచు జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల వెంట్రుకల సమస్య కూడా తగ్గుతుంది. అయితే, మార్కెట్లో వివిధ రకాల ఆముదం నూనె అందుబాటులో ఉంది కానీ కేవలం ఆర్గానిక్ లేదా కోల్డ్ కంప్రెసర్ ఆముదం నూనెను మాత్రమే కొనుగోలు చేయాలి. దీన్ని జుట్టుకి అప్లై చేసే ముందు కాస్త గోరువెచ్చగా చేసి వేళ్ల సహాయంతో జుట్టుకుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయం మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి.

Tags:    

Similar News