Diabetes: డయాబెటిస్ ఉన్నా ఏం పర్లేదు.. ఈ పండ్లను ఎంచక్కా తినొచ్చు
Diabetes: మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం కారణం ఏదైనా ఇటీవల డయాబెటిస్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.

Diabetes: డయాబెటిస్ ఉన్నా ఏం పర్లేదు.. ఈ పండ్లను ఎంచక్కా తినొచ్చు
Diabetes: మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం కారణం ఏదైనా ఇటీవల డయాబెటిస్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. తక్కువ వయసు ఉన్న వారు కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే చాలు ఏది తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. ముఖ్యంగా పండ్ల విషయంలో ఎన్నో అనుమానాలు ఉంటాయి. అయితే డయాబెటిస్ ఉన్న వారు కొన్ని రకాల పండ్లను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* కివి పండ్లు డయాబెటిస్ ఉన్నవారికి మంచివి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించడంలో సహాయపడతాయి. కివి పండ్లలో అధికంగా ఫైబర్, విటమిన్లు ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోజూ ఒక కివి పండు తింటే షుగర్ స్థాయులను అదుపులో ఉంచుకోవచ్చు.
* నేరేడు పండ్లు డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ పండ్లలో ఉన్న యాంటీ డయాబెటిక్ లక్షణాలు రక్తంలో గ్లూకోజ్‌ను సమతుల్యం చేస్తాయి. ప్రత్యేకంగా, నేరేడు విత్తనాల పొడి కూడా షుగర్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక టీస్పూన్ నేరేడు విత్తనాల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి రోజుకు రెండు పూటలా తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది.
* స్టార్ ఫ్రూట్ డయాబెటిస్ ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. ఇందులో గ్లూకోజ్ నియంత్రణ గుణాలు ఉండటంతో షుగర్ స్థాయిని అదుపులో ఉంచుతుంది.
* జామకాయలో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది. రోజూ జామకాయ తినడం ద్వారా డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
* చెర్రీలు తియ్యగా ఉన్నా, గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే ఇవి డయాబెటిస్ ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది.
* పైనాపిల్‌లో యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.