Health: ఉప్పు నీరు తాగితే.. నిజంగానే లాభాలున్నాయా.?
Health: ప్రతీ ఒక్క వంటకంలో కచ్చితంగా ఉపయోగించే పదార్థాల్లో ఉప్పు ఒకటి. కూరకు రుచిని ఇవ్వడంలో ఉప్పు కీలక పాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Health: ఉప్పు నీరు తాగితే.. నిజంగానే లాభాలున్నాయా.?
Health: ప్రతీ ఒక్క వంటకంలో కచ్చితంగా ఉపయోగించే పదార్థాల్లో ఉప్పు ఒకటి. కూరకు రుచిని ఇవ్వడంలో ఉప్పు కీలక పాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పును ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయని తెలిసిందే. అయితే ఉప్పు కలిపిన నీటిని కొంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని మీకు తెలుసా.? ఇంతకీ ఉప్పు నీటిని తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* తక్కువ స్థాయిలో ఉప్పునీరు తాగడం శరీర ద్రవ సమతుల్యతను కాపాడుతుంది. సహజ ఉప్పులో ఉండే సోడియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేయడంలో ఉపయోగపడుతుంది.
* శారీరక శ్రమ ఎక్కువగా చేసే వ్యక్తుల్లో ఎక్కువ చెమట వస్తుంది. ఇలాంటి వాళ్లు ఉప్పునీటి ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి పొందవచ్చు. ఎలక్ట్రోలైట్లు నరాల పనితీరు, కండరాల సంకోచం, సెల్యులార్ క్రియాశీలతకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
* ఉప్పునీరు కడుపులో ఆమ్లాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది, దీంతో జీర్ణక్రియ మెరుగవుతుంది. ఉదయం గోరువెచ్చని ఉప్పు నీరు తాగడం వల్ల ప్రేగుల పనితీరు మెరుగై, కడుపుబ్బరం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
* ప్రేగు కదలికలను ప్రేరేపించి శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో ఉప్పు నీరు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.
* ఉప్పు నీరు ఒత్తిడిని తగ్గించి నిద్ర నాణ్యతను మెరుగుపరిచే అవకాశం ఉంది. సోడియం, అడ్రినల్ గ్రంథులను ప్రభావితం చేస్తూ ఒత్తిడి హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.