Pregnency: గర్భిణీలు ఇది తింటే.. పుట్టే పిల్లల్లో ఆటిజం సమస్య
Pregnency: గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే ఆహారం బిడ్డ ఆరోగ్యంపై కీలక ప్రభావాన్ని చూపిస్తుందని తెలిసిందే. అందుకే గర్భిణీలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు.

Pregnency: గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే ఆహారం బిడ్డ ఆరోగ్యంపై కీలక ప్రభావాన్ని చూపిస్తుందని తెలిసిందే. అందుకే గర్భిణీలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. మరీ ముఖ్యంగా గర్భిణీలు ఎట్టి పరిస్థితుల్లో జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. గర్భం దాల్చిన సమయంలో జంక్ పుడ్ తీసుకుంటే పుట్టబొయే పిల్లల్లో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉందని తాజా పరిశోధనల్లో తేలింది.
ప్రధానంగా ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్ కలిగిన పదార్థాలు తీసుకుంటే ఇవి తల్లిపైనే కాకుండా, బిడ్డ మెదడు అభివృద్ధిని కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. తాజాగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం గర్భిణీలు జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటే పుట్టే బిడ్డల్లో హైపర్యాక్టివిటీ డిజార్డర్ వచ్చే అవకాశాలు 66 శాతం ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే ఇలాంటి పిల్లల్లో ఆటిజం వచ్చే ప్రమాదం 122 శాతం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైంది.
అందుకే గర్భిణీలు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బర్గర్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. అలాగే చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్, స్వీట్స్, కేకులకు దూరంగా ఉండాలి. ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్యాకెట్ స్నాక్స్, చిప్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోకూడదు. సమోసా, ఫ్రైడ్ చికెన్ వంటి డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి.?
గర్భిణీలు ఎక్కువగా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. వీటిలో మెదడు అభివృద్ధికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి పౌష్టికమైన తృణధాన్యాలు తీసుకోవాలి ఇవి శక్తిని ఇస్తాయి. ఒమేగా-3 పుష్కలంగా ఉండే వాల్‌నట్స్, చేపలు, అవిసె గింజలు తీసుకోవాలి. ఇవి బిడ్డ మెదడు ఎదుగుదలకు సహాయపడతాయి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అయిన పప్పులు, గుడ్లు, చికెన్ వంటివి తీసుకోవాలి. ఇవి శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే పాలు, పెరుగు, చీజ్ వంటివి తీసుకోవాలి.