Fenugreek Seeds: జుట్టును పొడుగ్గా ..మందంగా చేసే మెంతిపొడిని ఇలా ఉపయోగించండి ..
Soaked Fenugreek For Long hair: మెంతులు వంటల్లో వినియోగిస్తారు. అయితే దీంతో బ్యూటీ బెనిఫిట్స్ కూడా పుష్కలం.. జుట్టు పెరుగుదలకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

Fenugreek Seeds: జుట్టును పొడుగ్గా ..మందంగా చేసే మెంతిపొడిని ఇలా ఉపయోగించండి ..
Soaked Fenugreek For Long hair: మెంతి పొడిలో అనేక పోషకాలు ఉంటాయి. డయాబెటిస్ వారికి కూడా మేలు చేస్తుంది. ఇది నేచురల్ ఇన్సూలిన్ అని కూడా చెప్పాలి. మెంతిపొడిని వంటల్లో మాత్రమే కాదు మెడిసిన్ రూపంలో ఉపయోగిస్తున్నారు. అయితే బ్యూటీ రొటీన్ లో కూడా చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
మెంతి పొడిని తీసుకోవడం వల్ల ఇందులో ఐరన్, విటమిన్ సి, పొటాషియం, నికొటిన్, ప్రోటీన్ కూడా మనకు అందుతుంది. దీంతో మీ జుట్టు బలంగా మారుతుంది. అంతేకాదు హెయిర్ ఫాల్ సమస్య కూడా చక్కని రెమెడీ. మెంతులను నానబెట్టి ఉదయం గ్రైండ్ చేసి ఆ పేస్టు జుట్టంతా పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేయాలి.
అంతేకాదు మెంతులను తీసుకోవడం వల్ల తలపై ఉండే చుండ్రు, ఇన్ఫెక్షన్లను త్వరగా తొలగిస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది.
మెంతులను రెగ్యులర్‌గా జుట్టుకు అప్లై చేయడం వల్ల శాశ్వతంగా మెరుపు వస్తుంది. జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే మెంతులను తీసుకోవడం వల్ల త్వరగా తెల్ల వెంట్రుకలు కూడా రావు .
మెంతులు ఈ ఎండాకాలం జుట్టుకు మంచి హైడ్రేషన్ అందిస్తాయి. దీని రెగ్యులర్‌గా జుట్టుకు ప్యాక్ రూపంలో వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలిగిస్తాయి. మెంతులను ఉపయోగించడం వల్ల ఇది హార్మోన్ కూడా కాపాడుతుంది. దీంతో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఇందులో ప్రోటీన్, నికోటిక్ ఆమ్లం జుట్టును కుదుళ్ల నుంచి బలంగా మారుస్తుంది.
మెంతులు పెరుగు లేదా నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయం పేస్టు చేసుకొని జుట్టు అంతటికీ అప్లై చేయాలి. కుదుళ్ల నుంచి చివర్ల వాళ్లకు అప్లై చేయడం వల్ల మీ చుట్టూ నల్లగా నిగనిగా లాడుతూ మెరుస్తూ కనిపిస్తుంది. అంతేకాదు కుదుళ్ల నుంచి జుట్టు ఊడకుండా బలంగా మారుతుంది. హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి.