Health Tips: మూత్రం నుంచి దుర్వాసన వస్తోందా.. తీవ్రమైన వ్యాధుల ప్రమాదం..!

Health Tips: మూత్రం నుంచి దుర్వాసన వస్తుంటే చాలా ప్రమాదం.

Update: 2022-12-30 14:30 GMT

Health Tips: మూత్రం నుంచి దుర్వాసన వస్తోందా.. తీవ్రమైన వ్యాధుల ప్రమాదం..!

Health Tips: మూత్రం నుంచి దుర్వాసన వస్తుంటే చాలా ప్రమాదం. ఇది తీవ్రమైన అనారోగ్య లక్షణం కావచ్చు. సాధారణంగా తగినంత నీరు తాగకపోతే శరీరం డీ హైడ్రేట్‌కి గురై మూత్రం దుర్వాసన వస్తుంది. నీటిని తక్కువ పరిమాణంలో తాగడం వల్ల మూత్రంలో నీరు తగ్గుతుంది. వ్యర్థ పదార్థాల పరిమాణం పెరుగుతుంది అందుకే దుర్వాసన వస్తుంది. అయితే కొన్నిసార్లు కొన్ని మందులు తీసుకున్న తర్వాత కూడా ఇది జరుగుతుంది. మూత్రం నుంచి ఎక్కువ వాసన వస్తుంటే ఎలాంటి వ్యాధులకి గురయ్యే అవకాశాలు ఉంటాయో ఈ రోజు తెలుసుకుందాం.

మధుమేహం

షుగర్ వ్యాధితో బాధపడేవారి మూత్రం చాలా దుర్వాసన వస్తుంది. డయాబెటిస్ సమస్య పెరిగినప్పుడు శరీరం రక్తంలో ఉన్న అదనపు చక్కెరను తొలగించడానికి ప్రయత్నిస్తుంది. ఈ పరిస్థితిలో యూనిర్లో చక్కెర పరిమాణం పెరుగుతుంది దీని కారణంగా దుర్వాసన వస్తోంది.

UTI

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ) సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు మూత్రంలో దుర్వాసనని కలిగి ఉంటారు. ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంది. UTI కారణంగా మూత్రం మరింత దుర్వాసన వస్తుంది. మూత్రంలో బ్యాక్టీరియా ఉండటం వల్ల ఈ దుర్వాసన వస్తుంది.

వ్యాధిని ఎలా తెలుసుకోవాలి?

మూత్రం దుర్వాసన వస్తోందని మీకు అనిపిస్తే ఏ వ్యాధి ఉందో కనుగొనవచ్చ. మధుమేహం, యుటిఐ లేదా మరేదైనా వ్యాధి కావచ్చు. ఈ వ్యాధుల లక్షణాలు భిన్నంగా ఉంటాయి. వీటి ఆధారంగా మీరు సదరు వ్యాధి గురించి తెలుసుకోవచ్చు. ఇది కాకుండా లక్షణాలను చూసిన తర్వాత మీరు వైద్యుడిని సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి. దీని ద్వారా కూడా ఏ వ్యాధికి గురయ్యారో తెలుస్తుంది.

Tags:    

Similar News