Ghee Quality Test: మీరు వాడుతున్న నెయ్యి మంచిదేనా? ఇలా చెక్ చేయండి...

చిన్నారులకు సైతం అందించే కల్తీ నెయ్యి ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

Update: 2024-09-07 07:15 GMT

Ghee Quality Test: మీరు వాడుతున్న నెయ్యి మంచిదేనా? ఇలా చెక్ చేయండి...

మార్కెట్లో లభించే ప్రతీ వస్తువుకు నకిలీ తయారు చేస్తున్నారు కేటుగాళ్లు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో ప్రజల ఆరోగ్యాలను పణంగా పెడుతున్నారు. అందమైన ప్యాకింగ్‌తో నకిలీ వస్తువులను యథేశ్చగా అమ్ముతున్నారు. దీంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఇలా నకిలీ చేస్తున్న వస్తువుల్లో నెయ్యి ఒకటి. ఇటీవల మార్కెట్లో కల్తీ నెయ్యి తయారీ ఎక్కువుతోంది. చిన్నారులకు సైతం అందించే కల్తీ నెయ్యి ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే మనం ఉపయోగిస్తున్న నెయ్యి అసలా.? నకిలీనా.? కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మీరు ఉపయోగిస్తున్న నెయ్యి అసలా.? నకిలీనా తెలుసుకోవడానికి నీటి పరీక్షను ఉపయోగించొచ్చు. ఇందుకోసం ఒక గాజు గ్లాసులో కొన్ని నీళ్లు తీసుకోవాలి. అనంతరం అందులో కొంత నెయ్యి వేయాలి. అది నీటిపై తేలితే మంచిదని అర్థం, నీట మునిగితే కల్తీనని అర్థం చేసుకోవాలి.

* ఒక గిన్నెలో కొంత నెయ్యి తీసుకోవాలి. అనంతరం నెయ్యిలో కొన్ని చుక్కల అయోడిన్‌ వేసి కలపాలి. ఒకవేళ నెయ్యి రంగు మారితే కల్తీ జరిగినట్లు అర్థం చేసుకోవాలి. రంగు మారకపోతే అది అసలైన నెయ్యి అని అర్థం చేసుకోవాలి.

* మీరు ఉపయోగిస్తున్న నెయ్యి అసలైందేనా తెలుసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి, పొయ్యి మీద పెట్టి కరిగించాలి. అనంతరం దాన్ని ఒక గాజు గ్లాసులో పోయాలి. నెయ్యి వేడి కొద్దిగా తగ్గిన తర్వాత గ్లాసును ఫ్రిజ్‌లో పెట్టాలి. నెయ్యి గడ్డకట్టిన తర్వాత చూస్తే అంతా ఒకే తీరుగ ఉంటే కల్తీ లేనట్టు. అలా కాకుండా పైన ఒక పొరలా ఏర్పడితే ఆ నెయ్యిలో ఏవో నూనెలు కలిపారని అర్థం చేసుకోవాలి.

* నెయ్యిని కొంచం చేతిలో వేసుకోవాలి. అనంతరం చేతిని ఏటవాలుగా వంచాలి. ఒకవేళ చేయి పై నుంచి నెయ్యి నెమ్మదిగా కరుగుతూ కిందికి జారిపోతే అది మంచి నెయ్యి అని అర్థం. అలా కాకుండా చేతిపైనే ఉంటే కల్తీ అని అర్థం.

* ఒక టెస్ట్‌ ట్యూబ్‌లో కొద్దిగా నెయ్యి వేయాలి. అనంతరం ఇందులో హైడ్రో క్లోరిక్‌ ఆమ్లం చుక్కలు కొన్ని వేసి కలపాలి. ఆ రెంటినీ కలిపితే నెయ్యి రంగు మారకపోతే స్వచ్ఛమైన నెయ్యిగా భావించొచ్చు. రంగు మారితే మాత్రం కల్తీ అని అర్థం.

Tags:    

Similar News