Milk: ప్యాకెట్ పాలు ఆరోగ్యానికి మంచివి కావా.? ఇందులో నిజమెంత..?

Milk: పాలు సరిగ్గా జీర్ణం కావనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే ఆవు పాలలో ప్రొటీన్‌ తక్కువగా ఉంటుంది.

Update: 2024-09-08 16:00 GMT

Milk: ప్యాకెట్ పాలు ఆరోగ్యానికి మంచివి కావా.? ఇందులో నిజమెంత.. 

Milk: ఉదయం లేవగానే మొదలు చేసే పని పాల ప్యాకెట్ తీసుకోవడం. పాలు లేనిది రోజు గడవని పరిస్థితి. చిన్న పిల్లల నుంచి పెద్దలు టీ వరకు ప్రతీ ఒక్కరికీ పాలు ఉండాల్సిందే. ఇక పాలలో ఎన్నో మంచి గుణాలు ఉంటాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాలతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. రోజువారీ అవసరాలకు కావాల్సిన అనేక గుణాలు పాలలో లభిస్తాయి.

శరీరానికి కావాల్సిన చక్కెర, ప్రొటీన్‌, కొవ్వులన్నీ పాలలో లభిస్తాయి. లైసిన్‌, త్రియానైన్‌ అనే అమైనో ఆమ్లాలూ పాలతో భర్తీ అవుతాయి. అందుకే నిపుణులు సైతం కచ్చితంగా పాలను తీసుకోవాలని చెబుతుంటారు. అయితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలకు సంబంధించి పలు అపోహలు ఉంటాయి.? ఇంతకీ ఆ అపోహల్లో నిజం ఎంత ఉంది.? అసలు నిజం ఎంత ఉంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పాలు సరిగ్గా జీర్ణం కావనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే ఆవు పాలలో ప్రొటీన్‌ తక్కువగా ఉంటుంది. కాబట్టి తేలికగానే జీర్ణమవుతాయి. గేదె పాలలో ప్రొటీన్‌ కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ఇవి కూడా తేలికగానే జీర్ణమవుతాయి. నిజానికి జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేని వారికి కూడా పాలు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మందిలో ఉండే మరో అపోహ ప్యాకెట్ పాలు మంచివి కావనే భావనలో ఉంటారు.

అయితే ఇందులో పూర్తిగా నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి డెయిరీల్లో పాలను ముందుగానే శుభ్రం చేసి, కొవ్వుశాతం సమానంగా ఉండేలా చేస్తారు. కొద్దిసేపు అత్యధిక ఉష్ణోగ్రతకు గురిచేసి, ఆ వెంటనే చల్లబరుస్తారు. దీంతో బ్యాక్టీరియా వంటివేవైనా ఉంటే చనిపోతాయి. కాబట్టి ప్యాకేజీ పాలు ముమ్మాటికీ సురక్షితమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పాలు తాగడం వల్ల బరువు పెరుగుతామనే ఒక అపోహ కూడా ఉంటుంది.

అయితే ఇందులో కూడా నిజం లేదు. మితంగా తాగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. కానీ చిక్కటి పాలు, గడ్డ పెరుగు వంటివి ఎక్కువెక్కువగా తీసుకుంటే మాత్రం కొలెస్ట్రాల్‌ పెరిగే ప్రమాదం ఉంటుంది. మరీ ముఖ్యంగా శారీరక శ్రమ లేకపోవడం దీనికి కారణంగా చెబుతుంటారు. పాలు తాగితే జలుబు వేస్తుందనే అపోహ కూడా ఉంది. నిజానికి ఇందులో ఏమాత్రం నిజం లేదు. పాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో పాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

Tags:    

Similar News