Health: మామిడి ఆకులను ఇలా తీసుకోండి.. ఊహకందని లాభాలు సొంతం చేసుకోండి

సాధారణంగా మామిడి ఆకులను ఇంటి గుమ్మానికి తోరణాలుగా మాత్రమే ఉపయోగిస్తాం. అయితే వీటిని వేడి నీటిలో మరగబెట్టి కషాయం రూపంలో తీసుకుంటే కళ్లు చెదిరే లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Update: 2024-09-16 00:25 GMT

Health: మామిడి ఆకులను ఇలా తీసుకోండి.. ఊహకందని లాభాలు సొంతం చేసుకోండి

మామిడి పండ్లు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. అయితే ఇవి కేవలం సమ్మర్‌లో మాత్రమే అందుబాటులోకి వస్తాయి. అయితే ఏడాదంతా అందుబాటులో ఉండే మామిడి ఆకులతో కూడా లాభాలున్నాయని మీకు తెలుసా.? సాధారణంగా మామిడి ఆకులను ఇంటి గుమ్మానికి తోరణాలుగా మాత్రమే ఉపయోగిస్తాం. అయితే వీటిని వేడి నీటిలో మరగబెట్టి కషాయం రూపంలో తీసుకుంటే కళ్లు చెదిరే లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ మామిడి ఆకుల కషాయంతో కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* డయాబెటిస్‌తో బాధపడేవారికి మామిడి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. మామిడి ఆకులతో చేసిన కషయాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌ అవుతాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్‌ కచ్చితంగా మామిడి ఆకులను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* మామిడి ఆకులతో చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. ముఖ్యంగా కడుపుబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తలెత్తకుండా చూడడంలో ఉపయోగపడతాయి.

* మామిడి ఆకుల్లో మాంగిఫెరిన్ యాంటీ మైక్రో బయల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఉదయాన్నే పరగడుపున మామిడి ఆకుల కషాయన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

* క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సైతం మామిడి ఆకులతో చేసిన కషాయం బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక ఒత్తిడితో బాధపడేవారు మామిడి ఆకులను మరిగించిన నీటితో స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.

* మామిడి ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు రక్తనాళాలను బలపరిచి రక్తపోటును నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. దీని కారణంగా గుండెపోటు వంటి సమస్యలు దరిచేరవు.

* మామిడి ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి, ఫ్లేవనాయిడ్లు , శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి.

* మామిడి ఆకులు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. జుట్టు నెరిసిపోకుండా ఇవి కాపాడతాయి. మామిడి ఆకులు మరగబెట్టిన నీటితో తలస్నానం చేస్తే వెంట్రుకల ఆరోగ్యం బలోపేతమవుతాయి.

Tags:    

Similar News