Lemon Water: ప్రతిరోజూ ఉదయం నిమ్మరసం ఎందుకు తాగాలి? ఈ కారణాలు తెలిస్తే ఒక్క చుక్క కూడా వదిలిపెట్టరంతే..!
Lemon Water Health Benefits: లెమన్ వాటర్ అనేది భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన పానీయం. అయితే, ప్రతిరోజూ ఉదయం నిమ్మరసం తాగడం వల్ల ఊబకాయం తగ్గడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. శరీరంపై ప్రతికూల ప్రభావాలున్నప్పుడు నిమ్మకాయ నీరు తాగడం మంచిది.
Lemon Water: లెమన్ వాటర్ అనేది భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన పానీయం. అయితే, ప్రతిరోజూ ఉదయం నిమ్మరసం తాగడం వల్ల ఊబకాయం తగ్గడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. శరీరంపై ప్రతికూల ప్రభావాలున్నప్పుడు నిమ్మకాయ నీరు తాగడం మంచిది. ఇందులో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. నిమ్మకాయ నీళ్ల వినియోగం మీ ఆరోగ్యంపై ఎలాంటి సానుకూల ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు కూడా మీ స్థూలకాయాన్ని తగ్గించుకోవాలనుకుంటే, ఇది మీకు సులభమైన మార్గం. ఇది ఆకలిని తగ్గించి, తక్కువ తినడానికి సహాయపడుతుంది. ఎందుకంటే నీరు మీ శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంతో పాటు మీ జీర్ణవ్యవస్థను కూడా సమతుల్యంగా ఉంచుతుంది.
నిమ్మకాయ నీళ్లతో ఉన్న అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటాన్ని అట్టుకుంటుంది. నిమ్మరసం తాగడం వల్ల శరీరాన్ని రీహైడ్రేట్ చేయడంతోపాటు కిడ్నీలో రాళ్లు తొలగిపోయేలా చేస్తుంది.
రోజూ పళ్లు తోముకున్న కొంత సమయం తర్వాత నోటి దుర్వాసన రావడం మొదలవుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ సి శ్వాసను తాజాగా ఉంచుతుంది. నోటిలో ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది.
రోజూ ఉదయం నిమ్మరసం తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది కడుపు వ్యాధులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే, ఇందులో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎసిడిటీ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ కారణంగా, కడుపు నొప్పి ఉన్నప్పుడు, నిమ్మకాయ నీరు ఇస్తుంటారు.
నిమ్మరసం నీరు అధిక చక్కెరతో కూడిన రసాలు, పానీయాలకు మంచి ప్రత్యామ్నాయంగా పరిగణిస్తుంటారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం ద్వారా, ఇది శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది, శక్తినిస్తుంది.
(గమనిక: ఈ వార్త మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే అందించాం. నెట్టింట్లో దొరికే సమాచారం ఇందులో పొందుపరిచాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి.)