ఇడ్లీ, దోసె పిండిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే

అయితే ఇలా పిండిని ఫ్రిజ్‌లో దాచి పెట్టి వాడడం ఆరోగ్యానికి మంచేదానా అంటే, అస్సలు మంచిది కాదని చెబుతున్నారు.

Update: 2024-09-15 13:48 GMT

Lifestyle: ఇడ్లీ, దోసె పిండిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే

ప్రతీరోజూ ఉదయం కచ్చితంగా టిఫిన్‌ ఉండాల్సిందే. కానీ ఉరుకుల పరుగల జీవితంలో చాలా మంది టిఫిన్‌ స్కిప్‌ చేస్తున్నారు. అయితే ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు. ఉదయం టిఫిన్‌ మానేసే వారిలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. బీపీ మొదలు, డయాబెటిస్‌ వరకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు టిఫిన్‌ చేయకపోవడం ఒక కారణమని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో కూడా వెల్లడైంది.

దీంతో చాలా మంది ఇన్‌స్టాంట్‌ ఇడ్లీ, దోసెల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే మార్కెట్లో దొరికే పౌడర్‌ను ఉపయోగించడం లేదా.. ఒకేసారి పెద్ద ఎత్తున పిండిని తయారు చేసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకోవడం. ఇది దాదాపు ప్రతీ ఒక్కరి ఇంట్లో కనిపించేదే. మరీ ముఖ్యంగా భార్య,భర్తలిద్దరూ ఉద్యోగం చేసే ఇళ్లలో ఇది సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఆదివారం సెలవు రోజు ఒకేసారి పిండిని రుబ్బేసి ఫ్రిజ్‌లో పెడుతారు. ఆ తర్వాత ప్రతీరోజూ అదే పిండితో టిఫిన్‌ చేసుకుంటారు.

అయితే ఇలా పిండిని ఫ్రిజ్‌లో దాచి పెట్టి వాడడం ఆరోగ్యానికి మంచేదానా అంటే, అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. పిండిని ఎక్కువ రోజులు నిల్వ చేసే పులుస్తుంది. ఫ్రిజ్‌లో పెట్టినా జరిగేది ఇదే. ఇలాంటి పులిసిన పిండితో చేసిన టిఫిన్స్ తినడం వల్ల ఎన్నో రకాల సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి పిండిని తినడం వల్ల అజీర్తి, కడుపులో మంట, ఇన్ఫెక్షన్, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పులిసిన పిండిని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. అలాగే ఇడ్లీ, దోసె పిండిని రుబ్బిన 24 గంటల్లోనే తీనేయాలని నిపుణులు చెబుతున్నారు. పిండిని తాజాగా తింటేనే మంచిదని సూచిస్తున్నారు.

Tags:    

Similar News