Liver: లివర్‌ ఆరోగ్యం ఇలా పదిలం.. చిన్న టిప్స్‌ పాటిస్తే చాలు..

లివర్‌ డ్యామేజ్‌ కారణంగా జీర్ణ సమస్యలు, బరువు తగ్గడం, కండరాల బలహీనత, దుర్వాసనతో కూడిన శ్వాస, తలనొప్పి, నీరసం వంటి ఎన్నో లక్షణాలు వేధిస్తుంటాయి.

Update: 2024-09-14 09:19 GMT

Liver: లివర్‌ ఆరోగ్యం ఇలా పదిలం.. చిన్న టిప్స్‌ పాటిస్తే చాలు.. 

ప్రస్తుతం లివర్‌ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఆహార నియమాలు మారడం, ఆల్కహాల్‌, స్మోకింగ్ వంటి చెడు అలవాట్ల కారణంగా లివర్‌ డ్యామేజ్‌ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో ఎంతో కీలకమైన లివర్‌ అనారోగ్యానికి గురైతే ఎన్నో సమస్యలు చుట్టుముడతాయని తెలిసిందే. అందుకే లివర్‌ ఆరోగ్యం కాపాడుకోవాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు. లివర్‌ డ్యామేజ్‌ కారణంగా జీర్ణ సమస్యలు, బరువు తగ్గడం, కండరాల బలహీనత, దుర్వాసనతో కూడిన శ్వాస, తలనొప్పి, నీరసం వంటి ఎన్నో లక్షణాలు వేధిస్తుంటాయి. అయితే తీసుకునే ఆహారంలో కొన్నింటిని భాగం చేసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ ఫుడ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* పసుపును డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల లివర్‌ ఆరోగ్యం మెరుగువుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కర్కుమిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. కర్కుమిన్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కాలేయం వాపును తగ్గించడంలో, టాక్సిన్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. పసుపును గొరువెచ్చని నీటిలో కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

* లివర్‌ ఆరోగ్యం కాపాడడంలో ఆకుకూరలు బాగా ఉపయోగపడతాయి. బచ్చలికూర, మెంతికూర, ఆవాలు లివర్‌ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. వీటిలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌ కాలేయ పనితీరును మెరుగుపరిచాయి. శరీరంలో ఉన్న విషాన్ని తొలగించడంలో ఆకు కూరలు కీలక పాత్ర పోషిస్తాయి.

* బీట్‌రూట్‌ సైతం బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో బీటైన్, యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే బీట్‌రూట్‌లోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. పచ్చి బీట్‌రూట్‌ను తీసుకోవడం వల్ల మరింత మెరుగైన ఫలితం ఉంటుంది.

* కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో వాల్‌నట్స్‌ బాగా ఉపయోగపడతాయి. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, యాంటీ-ఆక్సిడెంట్లు లివర్‌ను రక్షిస్తాయి. వీటిలోని ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతీరోజూ నాలుగు వాల్‌నట్స్‌ తీసుకోవడం వల్ల లివర్‌ ఆరోగ్యంగా ఉంటుంది.

* గ్రీన్‌టీలోని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయం ఆరోగ్యం మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. గ్రీన్‌ టీలో ఉండే కాటెచిన్లు కాలేయ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. వాటిని బాగు చేయడంలో సహాయపడతాయి. రోజూ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యం మెరుగవుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News