Health: ఆరెంజ్‌ గింజలను పడేస్తున్నారా? ఇది తెలిస్తే ఇకపై అలా చేయరు

Update: 2024-11-17 05:45 GMT

Health benefits of Orange seeds in Telugu: సిట్రస్‌ జాతికి చెందిన ఆరెంజ్‌తో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే. ఇందులోని విటమిన్‌ సి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడం మొదలు, మరెన్నో బెనిఫిట్స్‌ ఉన్నాయి వీటితో. అయితే సాధారణంగా ఆరెంజ్‌ను తిని అందులో ఉన్న గింజలను పడేస్తుంటాం.

కానీ నారింజ గింజలతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నారింజ గింజలను ఎండబెట్టి వాటిని పొడి చేసుకొని తీసుకుంటే పలు రకాల సమస్యలన్నీ బలదూర్‌ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* రోగనిరోధక శక్తిని పెంచడంలో ఆరెంజ్‌ విత్తనాలు బాగా ఉపయోపడుతుంది. ఇందులోని విటమిన్‌ సి ఇమ్యూనిటీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా సీజనల్‌ వ్యాధులను బలదూర్‌ చేస్తుంది. ఆరెంజ్‌ సీడ్స్‌ను పొడిగా చేసి తీసుకుంటే పలు సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

* ఆరెంజ్‌ సీడ్స్‌లో ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇవి చర్మ కణాలను కాపాడుతాయి. చర్మం రంగును మెరుగుపరుస్తుంది. ఇవి ఫ్రీ రాడికల్స్‌కి వ్యతిరేకంగా పోరాడుతాయి. సెల్‌ డామేజ్‌ కాకుండా కాపాడడంలో ఉపయోగపడుతుంది.

* ఆరెంజ్‌ సీడ్స్‌లో ఫైబర్‌ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆరెంజ్‌ సీడ్స్‌ను పొడి చేసుకోవడం వల్ల పేగు కదలికలు పెరుగుతాయి. ఇది మలబద్దకం సమస్యను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది.

* ఆరెంజ్‌ సీడ్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ రంగును మెరుగుపరుచుకోవడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి.

నోట్‌: ఈ వివరాలు కేవలం ఇంటర్నెట్‌ వేదికగా లభించిన సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News