బెల్ట్ పెట్టుకుంటున్నారా.? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు..
Wearing Belt: ప్యాంట్ వేసుకునే ప్రతీ ఒక్కరూ కచ్చితంగా బెల్టును ఉపయోగిస్తారు. ప్యాంట్ లూజ్‌గా ఉంటే బెల్టును ధరిస్తారని తెలిసిందే.
Wearing Belt: ప్యాంట్ వేసుకునే ప్రతీ ఒక్కరూ కచ్చితంగా బెల్టును ఉపయోగిస్తారు. ప్యాంట్ లూజ్‌గా ఉంటే బెల్టును ధరిస్తారని తెలిసిందే. అయితే ప్రస్తుతం స్టైల్ కోసం కూడా బెల్టులను ధరిస్తున్నారు. రకరకాల మోడల్స్‌లో ఉన్న బెల్టులు వాడుతున్నారు. ఒకప్పుడు కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైన బెల్టుల ట్రెండ్‌ను ఇప్పుడు మహిళలు కూడా ఫాలో అవుతున్నారు.
అయితే బెల్టు పెట్టుకునే అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని అంటే నమ్ముతారా.? కానీ తాజాగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బెల్టు ధరించడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అవసరం లేకపోయినా బెల్ట్ ధరించడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. నడుముకు టైట్‌గా బెల్టు పెట్టుకోవడం వల్ల నడుము, పొత్తి కడుపులో తిమ్మిరి భావన కలుగుతుందని అంటున్నారు.
బెల్టును టైట్‌గా ధరించడం వల్ల పొట్టపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా పొట్టలోని ఆమ్లం గొంతులోకి చేరుతుంది. ఇది అసిడిటీకి దారి తీసే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. మహిళలు బెల్టు ధరించడం వల్ల సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. పొట్టపై భారం పడడంతో పాటు వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. బెల్టు ధరించడం వల్ల నరాల సమస్యతో పాటు గుండెలో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
బెల్టులు మాత్రమే కాకుండా మహిళలు లంగాలను గట్టిగా బిగించి కట్టుకోవడం కూడా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. దీనివల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని పరిశోధనల్లో వెల్లడైంది. లంగాను గట్టిగా బిగించి కట్టడం వల్ల అది చర్మానికి ఒరుసుకుపోయి పుండ్లు ఏర్పడి చర్మ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. గతంలో దీనిని ‘చీర క్యాన్సర్’గా వ్యవహరించే వారని, కానీ, లంగా నాడా బిగించి కట్టడం వల్ల ఈ క్యాన్సర్ వస్తోంది కాబట్టి ఇప్పుడు దీనిని ‘పెట్టీకోట్ క్యాన్సర్’గా చెబుతున్నారు.