Health: ఎక్కువ కాలం నిద్రపోకపోతే ఏమవుతుందో తెలుసా.? ఊహకందని మార్పులు..!
Health: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో నిద్రకూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు.

Health: ఎక్కువ కాలం నిద్రపోకపోతే ఏమవుతుందో తెలుసా.? ఊహకందని మార్పులు..!
Health: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో నిద్రకూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. అయితే సరిపడ నిద్రలేకపోతే పలు ఇబ్బందులు తప్పవు. తగినంత నిద్రలేకపోతే శారీరక ఆరోగ్యంతోపాటు, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇంతకీ నిద్రలేమితో కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* ఎక్కువకాలం నిద్రలేమితో బాధపడితే మెదడు పనితీరు తగ్గిపోతుంది. దీంతో ఫోకస్ తగ్గుతుంది. జ్ఞాపకశక్తి, నిర్ణయ సామర్థ్యం తగ్గిపోతాయి. మూడ్ స్వింగ్స్ ఏర్పడుతాయి. ఒత్తిడి, డిప్రెషన్, ఆంగ్జైటీ వంటివి ఎక్కువవుతాయి. దీంతో చిన్న విషయాలకే కోపం, నిరాశ, అధైర్యం వంటి సమస్యలు వస్తాయి.
* ఇక శారీరక ఆరోగ్యంపై కూడా నిద్రలేమి ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో ఎన్నో రకాల వ్యాధులకు ఇది దారి తీస్తుంది. అలాగే నిద్రలేమి కారణంగా రక్తపోటు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది హృదయ సంబంధిత వ్యాధులకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఎక్కువకాలం నిద్రలేమితో బాధపడితే బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. నిద్రలేమి కారణంగా మనకు తెలియకుండానే ఎక్కువ భోజనం చేస్తామని నిపుణులు చెబుతున్నారు.
* అలాగే నిద్రలేమి కారణంగా అందం కూడా దెబ్బ తింటుంది. కళ్ల కింద డార్క్ సర్కిల్స్, చర్మం కాంతిహీనంగా మారుతుంది. ముఖం కళను కోల్పోతుతుంది.
* సరైన నిద్రలేకపోతే రోజువారీ కార్యకలాలపై ప్రభావం పడుతుంది. చేసే పనులపై ఏకాగ్రత తగ్గుతుంది. దీంతో సమాజంలో క్రియాశీలకంగా ఉండలేరు.
ఇలా చెక్ పెట్టండి..
నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టేందుకు జీవన విధానంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ రాత్రి ఒకే సమయానికి పడుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. అదే విధంగా రాత్రుళ్లు పడుకునే ముందు కాఫీ, టీలు, మద్యం లాంటి తీసుకోవడం పూర్తిగా మానేయాలి. పడుకునే రెండు గంటల ముందే భోజనాన్ని పూర్తి చేయాలి. స్మార్ట్ ఫోన్, మొబైల్ గ్యాడ్జెట్స్‌కు రాత్రిపూట దూరంగా ఉండాలి. ఒకవేళ దీర్ఘకాలంగా ఈ సమస్య వెంటాడితే వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.