Unwanted Hair Removal Tips: ముఖంపై అవాంఛిత రోమాలు తొలగించడానికి సహజ పద్ధతులు.. వ్యాక్సింగ్‌కు మంచి ప్రత్యామ్నాయం!
Unwanted Hair Removal Tips: మహిళల అందాన్ని అవాంఛిత రోమాలు దెబ్బతీస్తున్నాయనే సమస్య చాలా మందికి తెలుసు.
![Unwanted Hair Removal Tips: ముఖంపై అవాంఛిత రోమాలు తొలగించడానికి సహజ పద్ధతులు.. వ్యాక్సింగ్‌కు మంచి ప్రత్యామ్నాయం! Unwanted Hair Removal Tips](https://assets.hmtvlive.com/h-upload/2025/01/29/1500x900_388680-unwanted-facial-hair.webp)
ముఖంపై అవాంఛిత రోమాలు తొలగించడానికి సహజ పద్ధతులు.. వ్యాక్సింగ్‌కు మంచి ప్రత్యామ్నాయం!
Unwanted Hair Removal Tips: మహిళల అందాన్ని అవాంఛిత రోమాలు దెబ్బతీస్తున్నాయనే సమస్య చాలా మందికి తెలుసు. పైపెదవి, గడ్డం, కొంతమందికి బుగ్గలపై పెరిగే అవాంఛిత రోమాలు చాలా ఇబ్బందిపెడతాయి. దీంతో చాలా మంది ముఖంపై వ్యాక్సింగ్‌ను ఆశ్రయిస్తారు. అయితే వ్యాక్సింగ్ వల్ల కొందరు వ్యక్తులకు పలు దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే సహజమైన పద్ధతులు పాటించడం వల్ల ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకోవడం ఆరోగ్యకరమైన పరిష్కారమని వారు చెబుతున్నారు.
1. చక్కెర, నిమ్మరసం మిశ్రమం
చక్కెర, నిమ్మరసం, నీటిలో 30 నిమిషాలు వేడి చేసి ఆ నీటిని ముఖంపై అప్లై చేస్తే అవాంఛిత రోమాలను సాఫీగా తొలగించవచ్చు.
2. తేనె, నిమ్మరసం, చక్కెర మిశ్రమం
తేనె, నిమ్మరసం, చక్కెర కలిపి వేడి చేసి చిక్కగా మారిన తర్వాత ముఖంపై అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని పూసి 30 నిమిషాల తర్వాత మృదువుగా రుద్దడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.
3. అరటిపండు, ఓట్ మీల్ పేస్ట్
బాగా పండిన అరటిపండు, ఓట్‌మీల్ పేస్ట్ కలిపి ముఖంపై 15 నిమిషాలు మర్దన చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖంపై వెంట్రుకలు సులభంగా తొలగిపోతాయి.
4. బంగాళదుంపరసం, నిమ్మరసం, తేనె మిశ్రమం
బంగాళాదుంప రసం, నిమ్మరసం, తేనె కలిపి ముఖంపై అప్లై చేసి, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే సహజంగా రోమాలు తొలగిపోతాయి.
5. శనగపప్పు పేస్ట్
రాత్రంతా నానబెట్టిన శనగపప్పును పేస్ట్ చేసుకుని ముఖంపై అప్లై చేయడం ద్వారా అవాంఛిత రోమాలను తొలగించవచ్చు.
6.కార్న్‌స్టార్చ్, చక్కెర, గుడ్డు తెల్లసొన:
కార్న్‌స్టార్చ్, చక్కెర, గుడ్డు తెల్లసొన మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి పొర ఏర్పడిన తర్వాత ఆరనివ్వాలి. ఆ తర్వాత తొలగిస్తే అవాంఛిత రోమాలు సులభంగా తొలగిపోతాయి.
ఈ సహజ పద్ధతులు అవాంఛిత రోమాల సమస్యను నొప్పి లేకుండా, సురక్షితంగా పరిష్కరించవచ్చు. ఈ చిట్కాలు సరైన ఫలితం ఇవ్వకపోతే చర్మ సంబంధిత నిపుణులను సంప్రదించి తగిన చికిత్స పొందడం మంచిది.