Kitchen Scrub: కిచెన్‌ స్క్రబర్‌తో కిడ్నీ సమస్యలు.? షాకింగ్ విషయాలు..

Kitchen Scrub Side Effect: వంట గదిలో ప్రతీ ఒక్కరూ కచ్చితంగా స్క్రబర్‌ను ఉపయోగిస్తుంటారు. పాత్రలను శుభ్రం చేయడానికి స్క్రబర్‌ ఉండాల్సిందే.

Update: 2024-09-18 07:03 GMT

Kitchen Scrub: కిచెన్‌ స్క్రబర్‌తో కిడ్నీ సమస్యలు.? షాకింగ్ విషయాలు..

Kitchen Scrub Side Effect: వంట గదిలో ప్రతీ ఒక్కరూ కచ్చితంగా స్క్రబర్‌ను ఉపయోగిస్తుంటారు. పాత్రలను శుభ్రం చేయడానికి స్క్రబర్‌ ఉండాల్సిందే. అయితే చాలా మంది స్క్రబర్‌ను ఉపయోగించిన తర్వాత అక్కడే పెట్టేస్తుంటారు. పాత్రలను సులభంగా శుభ్రం చేసేందుకు ఉపయోగపడే స్క్రబర్‌ మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని చెబితే నమ్ముతారా.? అయితే నిపుణులు మాత్రం ఇది నిజమే అంటున్నారు. సింక్‌లో పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగించే స్క్రబ్‌లు, స్పాంజ్‌ల వల్ల మీ కిడ్నీల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

స్క్రబర్‌తో కిడ్నీల ఆరోగ్యం పాడవ్వడం ఏంటనేగా మీ సందేహం. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. స్పాంజ్‌లు లేదా స్బ్రబర్‌లు ఎక్కువ సేపు తడిగా ఉండటం వల్ల వీటిలో బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ స్క్రబ్‌లో ఈకోలి, ఫీకల్ బ్యాక్టీరియా, సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా పేరుకుపోతుంది. వీటితో పాత్రలను శుభ్రం చేస్తే ఈ బ్యాక్టీరియా పాత్రలకు అంటుకుని ఆహారం తినే సమయంలో మన కడుపులోకి వెళ్తుంది. తడి స్పాంజ్ బ్యాక్టీరియా పెరగడానికి అనువైన స్థలంగా చెప్పొచ్చు.

ఇలాంటి బ్యాక్టీరియా శరీరంలో వెళ్తే.. పేగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్, క్రాస్ కాంటామినేషన్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి. ఈ బాక్టీరియా మెనింజైటిస్, న్యుమోనియా, అధిక జ్వరం, అతిసారంతో పాటు కిడ్నీ ఫెయిల్యూర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు ఈ బ్యాక్టీరియా రక్తంలో కూడా వ్యాపిస్తుందని చెబుతున్నారు.

స్క్రబ్స్‌లో పెరిగే యాంపిలోబాక్టర్ అనే బ్యాక్టీరియా పేగులను తీవ్రంగా దెబ్బతీస్తుందని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన బయోమెడికల్ ఇంజనీర్లు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అదే విధంగా ఈకోలి బ్యాక్టీరియా హెమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్‌కు కారణమవుతుంది, ఇది మూత్రపిండాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. 

Tags:    

Similar News