Siddaramaiah: 30ఏళ్లుగా డయాబెటిస్‎తో సీఎం సిద్ధరామయ్య.. అయినా ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారంటే?

Update: 2024-10-25 07:36 GMT

Siddaramaiah: 30ఏళ్లుగా డయాబెటిస్‎తో సీఎం సిద్ధరామయ్య.. అయినా ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారంటే?

Siddaramaiah: నేటి కాలంలో చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, ఒత్తిడితోపాటు ఇతర కారణాల వల్ల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే కొందరికి వంశపార్యపరంగా డయాబెటిస్ వస్తే..ఇంకొంతమందికి అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా వస్తుంది.

శరీరంలో ఉండే చక్కెర హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే డయాబెటిస్ ను వ్యాధిగా అస్సలు భావించకూడదు. ఎందుకంటే ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమేనని చెప్పవచ్చు.

సరైన డైట్ పాటించినట్లయితే..డయాబెటిస్ పూర్తిగా కంట్రోల్ అవుతుందని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన వ్యక్తిగత అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.

కర్నాటక సీఎం సిద్ధరామయ్య రాష్ట్రవ్యాప్తంగా గురువారం పలు పథకాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తనకు డయాబెటిస్ ఉందని అందుకే చెప్పులు లేకుండా అస్సలు నడవనని చెప్పారు. గత 30 సంవత్సరాలుగా తాను షుగర్ ను నియంత్రిస్తూ వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతిరోజూ వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్ తోనే షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెప్పారు.

అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే చక్కెర వ్యాధిని కంట్రోలో చేసుకోవడం చాలా ఈజీ అన్నారు. గుండె సంబంధిత సమస్య తలెత్తడంతో తాను స్టంట్ వేయించుకుని కూడా 24 సంవత్సరాలు అవతుందని వైద్యుల సలహాను పాటిస్తూ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నానని చెప్పారు.

ముందుగానే గుర్తిస్తే క్యాన్సర్ లాంటి మహమ్మారి కూడా నయం అవుతుందని పేర్కొన్నారు. అలాంటిది షుగర్, బీపీలను విజయవంతంగా నియంత్రించుకోవచ్చని తెలిపారు. అయితే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మాత్రం పాటించాలన్నారు. ఆరోగ్య సమస్యలను దాచిపెట్టడం అస్సలు మంచిది కాదని తెలిపారు. చాలా మంది ఆర్థిక పరిమితుల వల్ల ఆరోగ్య పరీక్షలకు దూరంగా ఉంటున్నారని..ఇది గుర్తించలేని వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంటుందని తెలిపారు.


Tags:    

Similar News