Early symptoms of diabetes: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? షుగర్ మొదలవుతున్నట్లే..
Early symptoms of diabetes: మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా డయాబెటిస్ బారినపడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.
Early symptoms of diabetes: మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా డయాబెటిస్ బారినపడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా భారత్‌లో డయాబెటిస్ రోగుల సంఖ్య క్రమంగా ఎక్కువుతోంది. అందుకే డయాబెటిస్ బారిన పడేవారు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే డయాబెటిస్‌ను ముందుగా గుర్తించి, చికిత్స ప్రారంభిస్తే డయాబెటిస్ నుంచి పూర్తిగా బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇంతకీ డయాబెటిస్‌ను ముందుగానే గుర్తించే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎలాంటి పనిచేయకపోయినా నిత్యం అలసటగా ఉంటే డయాబెటిస్ లక్షణంగా భావించాలని అంటున్నారు. చిన్న చిన్న పనులకే అలసిపోతుంటే వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని అంటున్నారు. ఇక తగినంత నీరు తాగుతోన్నా తరచుగా దాహం వేస్తుంటే డయాబెటిస్ ముందస్తు లక్షణంగా భావించాలని అంటున్నారు. అదే విధంగా ఆకలి పెరగడం, శరీర బరువులో ఉన్నట్లుండి మార్పులు కనిపించినా డయాబెటిస్ ప్రారంభ లక్షణంగా భావించాలని చెబుతున్నారు.
ఇక డయాబెటిస్ ప్రాథమిక లక్షణాల్లో మూత్ర విసర్జన ఒకటి. ముఖ్యంగా రాత్రుళ్లు తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటే డయాబెటిస్ ప్రాథమిక లక్షణంగా భావించాలని అంటున్నారు. ఇక తరచుగా పుండ్లు కావడం, పుండ్లు త్వరగా తగ్గకపోయినా సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ఇక చూపు మందగిస్తున్నా, మసకబారుతోన్నా షుగర్ వ్యాధి లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన లక్షణాలు ఏవి కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు అంటున్నారు. అలాగే నిత్యం క్రమంతప్పకుండా షుగర్ టెస్ట్ చేయించుకోవాలని అంటున్నారు. మరీ ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు తెలిపిన సూచనలు పాటించడమే ఉత్తమమని నిపుణులు అంటున్నారు.