Dhanteras 2024: ధన త్రయోదశి అంటే ఏమిటి.. ఎందుకు జరుపుకుంటారు.. ప్రాముఖ్యత ఏంటి?

Dhanteras 2024: ధనత్రయోదశి లేదా ధంతేరాస్ ను దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరాది ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఈ మధ్యకాలంలో దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ధనత్రయోదశిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ధనత్రయోదశి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Update: 2024-10-28 05:42 GMT

Dhanteras 2024: ధన త్రయోదశి అంటే ఏమిటి.. ఎందుకు జరుపుకుంటారు.. ప్రాముఖ్యత ఏంటి?

Dhanteras 2024: హిందూ క్యాలెండర్ ప్రకారం..దీపావళి పండగకు ముందు వచ్చే త్రయోదశి రోజును ధనత్రయోదశి పండగను జరుపుకుంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 29న మంగళవారం ధనత్రయోదశిని జరుపుకోనున్నారు. ఆ రోజు ఆయుర్వేద దేవుడైన ధన్వంతరిని సంపద, శ్రేయస్సు కలిగించే దేవత అయిన లక్ష్మీదేవిని ప్రజలు పూజిస్తుంటారు. ధన్ సంపదను సూచిస్తుంది. తేరాస్ కృష్ణపక్షంలోని 13వ రోజును సూచిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం..ఈ పండగ రోజు లక్ష్మీదేవి కుబేరుని స్వాగతించే ప్రయత్నంలో భాగంగా బంగారం, వెండి ఆభరణాలు, పాత్రలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి శుభంగా పరిగణిస్తారు. పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయడం వల్ల సంపద, శ్రేయస్సు విషయాల్లో అదృష్టాన్నిపొందుతామని భావిస్తుంటారు.

ధన త్రయోదశిని దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరాది ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఈమధ్య కాలంలో దక్షిణాదిలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. పండగరోజు తమ శక్తి కొద్ది బంగారం కొనుగోలు చేసి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తారు. గణేషుడు, లక్ష్మీదేవి, కుబేరుడి బొమ్మలను కొనుగోలు చేసి పూజిస్తారు.

ధంతేరాస్ కథ

సముద్ర మథనంలో అమృతంతోపాటు లక్ష్మీదేవి ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. ధనత్రయోదశినాడు మహాలక్ష్మీతోపాటు పాటు సంపదలను కూడా ఆహ్వానించడం పూర్వ సంప్రదాయం.

యమదీపం ఉత్సవం:

ఈరోజు యమరాజును సంతోపరచడానికి ఉద్దేశ్యంతో ప్రదోషకాలంలో దీపాలను వెలిగించడం పరంపర. యమదీపమును వెలిగించడం ద్వారా అకాల మరణం నుంచి రక్షణ పొందుతారని నమ్ముతుంటారు.

లక్ష్మీపూజ విధానం:

పూజా విధుల కోసం సాయంత్రం ప్రదోష సమయం అనుకూలమైంది. కలశం, కుంకుమ, పసుపు, పుష్పాలు, పంచామృతం, నైవేద్యాలు సమర్పించాలి.

మహాలక్ష్మీ పూజ :

లక్ష్మీదేవిని ఆసీనము చేసి సంపూర్ణ భక్తితో పూజిస్తుంటారు. శ్రీవిష్ణుమూర్తిని కూడా పూజించడం ద్వారా సంపూర్ణమైన ఆశ్వీర్వాదాలను పొందుతారు. ఇంటి ఎదురుగా నూనె దీపం వెలిగించి యమరాజును పూజిస్తుంటారు. ఇది కుటుంబాన్ని రక్షించేందుకు అత్యంత మంగళకరంగా భావిస్తారు. ధనత్రయోదశి రోజు లక్ష్మీ పూజను ఆచరించడం వలన సంపద పెరుగుతుందని ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయని నమ్ముతుంటారు. యమదీపంవేడుక ద్వారా కుటుంబ సభ్యులు ఆరోగ్యం కాపాడుతుందని భావిస్తారు. ఇది కేవలం ఆర్థిక సంపదనే కాకుండా సాంస్కృతిక, ధార్మిక విలువలతో కూడిన పర్వదినంగా చెబుతుంటారు.

ధనత్రయోదశిని నమ్మకంతో భక్తితో ఆచరించడం ద్వారా కేవలం ధనమే కాకుండా జీవన శ్రేయస్సు కూడా కలుగుతుంది. దీపావళి ఉత్సవాలు ఈ పర్వదినంతో ప్రారంభమవుతుంది. వెలుగుల ద్వారా మన జీవితం ఆనందంతో నిండిపోవాలని ఈ పర్వదీనం శుభాకాంక్షిస్తుంది. 

Tags:    

Similar News