Natural Hair Packs: దీపావళి వేళ బ్యూటీ పార్లర్ కు వెళ్లకుండానే మీ జుట్టు మెరుపు కోసం.. ఈ 5 నేచురల్ హెయిర్ ప్యాక్స్ ట్రై చేయండి
Natural Hair Packs: దీపావళికి సన్నాహాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. మహిళలు ఇంటిని శుభ్రం చేయడంతో పాటు తమ అందంపై కూడా చాలా శ్రద్ధ చూపడం సహజం. దీపావళి వేళ అందంగా కనిపించాలని ప్రతీ ఒక్క మహిళ అనుకుంటుంది. అయితే వర్కింగ్ ఉమెన్ ఎక్కువగా ఎండ, దుమ్ము, కాలుష్యం వల్ల జుట్టు మెరుపు కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. ఇందుకోసం చాలా మంది బ్యూటీ పార్లర్‌కు వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుంటారు. అయితే పార్లర్‌లో రసాయన ఉత్పత్తులను కూడా వాడుతున్నారు. ఈ రోజు మనం అలాంటి 5 హోమ్ మేడ్ హెయిర్ మాస్క్‌ల గురించి తెలుసుకుందాము. ఈ హెయిర్ మాస్క్‌లను ఇంట్లోనే తయారు చేయడం ద్వారా మాత్రమే మీరు మీ జుట్టు మెరుపును తిరిగి తీసుకురావచ్చు.
1. మెంతులు, పెరుగు ప్యాక్:
మెంతులు, పెరుగు. ఈ ప్యాక్ చేయడానికి ముందుగా కొన్ని మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. తర్వాత ఉదయాన్నే గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసి అందులో సమాన పరిమాణంలో పెరుగు కలపాలి. ఈ ప్యాక్‌ను తలకు జుట్టుకు సుమారు 25 నిమిషాల పాటు అప్లై చేసి, ఆపై జుట్టును కడగాలి. దీంతో జుట్టు మెరుస్తుంది.
2. మందార పూలతో చేసిన ప్యాక్:
ఈ ప్యాక్ చేయడానికి, కొన్ని మందార ఆకులను నీటితో గ్రైండ్ చేసి...మందపాటి పేస్ట్‌లా చేయాలి. అందులో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలపాలి. ఇప్పుడు తయారుచేసిన ప్యాక్‌ని తలకు మొత్తం జుట్టుకు అప్లై చేయండి. జుట్టు మీద 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి.
3. గుడ్లు ఆలివ్ నూనె ప్యాక్:
ఈ ప్యాక్ చేయడానికి, గుడ్డులోని తెల్లసొనలో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి. దీన్ని కాటన్‌తో తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. గుడ్డులోని తెల్లసొన మీ జుట్టుకు సహజమైన ప్రొటీన్‌ను అందజేస్తుంది. ఇది జుట్టును బలంగా మారుస్తుంది.
4. ఉల్లిపాయ, కొబ్బరి నూనె ప్యాక్:
జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి ఈ ప్యాక్ అత్యంత ప్రభావవంతమైన ప్యాక్. ఒక ఉల్లిపాయను మెత్తగా దంచి దాని రసాన్ని తీయండి. దీనికి ఒక చెంచా కొబ్బరి నూనె కలపండి. తలతో సహా మీ జుట్టు మీద మిశ్రమాన్ని రాయండి. 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై మీ జుట్టును కడగాలి.
5. అలోవెరా, తేనె ప్యాక్:
కలబంద జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది . జుట్టు రాలడాన్ని నియంత్రించే శక్తి దీనికి ఉంది. ఈ ప్యాక్ చేయడానికి, 2 టేబుల్ స్పూన్ల కెమికల్ ఫ్రీ అలోవెరా జెల్ లో 1 టేబుల్ స్పూన్ తేనె కలపండి. సిద్ధం చేసుకున్న ప్యాక్‌ని మీ జుట్టుతో పాటు తలకు పట్టించాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయండి.