Coriander Tea Benefits: ధనియాల టీతో ఇన్ని లాభాలున్నాయా.? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
Coriander Tea Benefits: వంటింట్లో కచ్చితంగా ఉండే వస్తువుల్లో ధనియాలు ముఖ్యమైనవి. ఏ వంట చేయాలన్న కచ్చితంగా ధనియాల పౌడర్ ఉండాల్సిందే.
Coriander Tea Benefits: వంటింట్లో కచ్చితంగా ఉండే వస్తువుల్లో ధనియాలు ముఖ్యమైనవి. ఏ వంట చేయాలన్న కచ్చితంగా ధనియాల పౌడర్ ఉండాల్సిందే. మన నిత్య జీవితంలో అంతలా భాగమైన ధనియాలను టీ చేసుకొని తాగితే లాభాలు ఓ రేంజ్‌లో ఉంటాయని నిపుణులు అంటున్నారు. ధనియాల టీని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనియాలను ఒక బౌల్‌లో తీసుకొని అందులో కొన్ని నీళ్లు కలపాలి. అనంతరం నీటిని బాగా మరిగించాలి. చివరిగా చల్లార్చి వడకట్టుకోవాలి. అనంతరం అందులో కొంత తేనె కలుపుకొని తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతీ రోజూ ఉదయం తీసుకోవడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఏంటంటే..
ప్రతీ రోజూ ధనియాల టీని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుందని నిపుణులు అంటున్నారు. ధనియాల్లో గింజల్లో యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు , డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇవి జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే లివర్ సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. కాలేయ పనితీరును ప్రోత్సహిస్తాయి.
చర్మ ఆరోగ్యానికి సంరక్షించడంలో కూడా ధనియాల టీ ఉపయోగపడుతుంది. ధనియాల టీ తాగడం వల్ల తామర, చర్మం దురద, దద్దుర్లు , వాపు వంటి చర్మ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. అలాగే ఇందులోని యాంటీ బయోటిక్ లక్షణాలు నోటి పూత, గాయాలను నయం చేస్తుంది. ది బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. ధనియాల టీ డయాబెటిస్ బాధితులకు దివ్యౌషధంగా చెప్పొచ్చు. ఇందులోని యాంటీ-హైపర్‌గ్లైసీమిక్, ఇన్సులిన్-విడుదల చేసే లక్షణాలు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
జుట్టు సమస్యలను దూరం చేయడంలో కూడా ధనియాల టీ ఉపయోగపడుతుంది. ధనియాలు బలహీనమైన , రాలుతున్న జుట్టు సమస్యకు సహాయపడుతుంది. ధనియాలు జుట్టు రాలడం ఆపడానికి , కొత్త జుట్టు పెరుగుదలకు జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. రోజూ ధనియాల టీని తాగే వారు బరువు కూడా తగ్గొచ్చు. ఇందులోని ఎన్నో మంచి గుణాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు.