Anger Management Foods: కోపంతో ఊగిపోతుంటారా? అయితే మీరు ఈ ఫుడ్ తినాల్సిందే..

Update: 2024-10-24 10:45 GMT

Anger Management Foods: కోపం.. కొంతమందిలో కనిపించే సర్వసాధారణమైన ఎమోషన్‌. కానీ అదే ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. కోపంతో ఊగిపోయే వారికి మానసిక సమస్యలు సైతం వేధిస్తుంటాయి. నిత్యం కోపంతో ఊగిపోయే వారికి మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. అందుకే..'తన కోపమే తన శత్రువు' అని పెద్దలు చెబుతుంటారు. కోపం కారణంగా ఇతరులకు ఇబ్బందులు కలగడమే కాకుండా వారికి కూడా సమస్యగా మారుతుంది. చిన్నచిన్న వాటికే కోపంతో ఊగిపోతుంటే తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఫుడ్స్‌తో కోపాన్ని కంట్రోల్‌ చేసుకోవచ్చు. ఇంతకీ ఆ ఫుడ్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కోపం ఎక్కువగా ఉన్న వారు పసుపును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. పసుపులో కర్కుమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో సెరోటోనిన్‌, డోపమైన్‌ వంటి మంచి హార్మోన్లను ప్రేరేపించడంలో తోడ్పడుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

* కోపాన్ని కంట్రోల్‌ చేయడంలో అవిసె గింజలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఆల్ఫా-లినోలెయిక్ యాసిడ్‌ను మెండుగా ఉంటాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఆందోళన, నిరాశతో నిత్యం ఇబ్బంది పడేవారు అవిసె గింజలను తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడొచ్చు.

* కోపంతో ఊగిపోయే వారు అరటిపండును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులోని విటమిన్‌ ఏ, బి, సి, బి6, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు శరీరాన్ని రిలాక్స్‌ చేస్తాయి. అరటి పండులోని మంచి గుణాలు డోపమైన్‌ వంటి హ్యాపీ హార్మోన్‌ యాక్టివ్‌ చేస్తాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను దూరం చేస్తాయి. ఇది కోపాన్ని జయించడంలో ఉపయోగపడుతుంది.

* కివీ పండు కూడా మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. కివిలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. ఇది ప్రో ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీంతో మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

* కోపాన్ని తగ్గించుకోవాలనుకునే వారు తీసుకునే ఆహారంలో కచ్చితంగా బాదం ఉండేలా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు. బాదంలోని కాల్షియం.. శరీరంలోని నరాలు, కండరాల కణాలకు ప్రశాంతతను అందిస్తుంది.

* కోపాన్ని జయించడంలో గుమ్మడి గింజలు బాగా ఉపయోగపడుతాయి. గుమ్మడి గింజల్లోని మెగ్నీషియం హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడతాయి. ఈ విత్తనాల్లో ట్రిప్టోఫాన్ ఉంటుంది, ఇది శరీరంలో సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. హార్మోన్ల సమతుల్యతను స్థిరీకరించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే ఈ మెగ్నీషియం అలసటను తగ్గించి, ఆందోళన సమస్యలను దూరం చేస్తుంది.

Tags:    

Similar News