Chicken: చికెన్ తినగానే ఇవి తీసుకుంటున్నారా.? డేంజర్ అంటోన్న నిపుణులు..
Chicken: చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే ఫుడ్‌లో చికెన్ మొదటి ప్లేస్‌లో ఉంటుంది.
Chicken: చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే ఫుడ్‌లో చికెన్ మొదటి ప్లేస్‌లో ఉంటుంది. వారంలో ఒక్కసారైనా చికెన్ తినకపోతే ఏదో కోల్పోయామన్న ఫీలింగ్‌లో ఉంటారు. రకరకాల పేర్లతో చికెన్‌ను లాగించేస్తుంటారు. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా చికెన్‌ను ఇష్టపడుతుంటారు. అయితే చికెన్ తిన్న తర్వాత కొన్ని రకాల ఫుడ్స్‌కు, డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ చికెన్ తిన్న వెంటనే తీసుకోకూడని ఆ ఫుడ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* మనలో చాలా మంది చికెన్‌తో పాటు పెరుగును ఎంతో ఇష్టంగా తీసుకుంటుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. చికెన్‌తో పెరుగును మిక్స్ చేసి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అజీర్తి, కడుపుబ్బరం వంటి సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు.
* చికెన్ తిన్న వెంటనే తేనెను కూడా తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. సాధారణంగా చికెన్ తిన్న వెంటనే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే తేనె కూడా జీర్ణమవ్వడానికి సమయం పడుతుంది. ఈ రెండింటిని ఒకేసారి తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు.
* చికెన్‌తో భోజనం చేసిన వెంటనే పాలు తాగడం అస్సలు మంచిది కాదు. పాలు జీర్ణమయ్యే ప్రక్రియ చికెన్‌కు భిన్నంగా ఉంటుంది. పాలు, చికెన్ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఏర్పడతాయి. చికెన్ జీర్ణం కావడానికి సమయం పడుతుంది, ఇది జీర్ణప్రక్రయకు అడ్డుపడుతుంది. ఈ కాంబినేషన్ వల్ల కడుపులో వికారం, అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం, మలబద్దకం, చర్మ సమస్యలకు దారి తీస్తుంది.
* చాలా మందికి చికెన్ తింటూ కూల్ డ్రింక్ తాగడం చాలా మందికి అలవాటు ఉండే ఉంటుంది. అయితే ఇది కూడా మంచిది కాదని అంటున్నారు. చికెన్ తింటూ కూల్ డ్రింక్ తాగితే కడుపులో జీర్ణ సంబంధిత సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు. అలాగే పండ్ల రసాలు కూడా తీసుకోకూడదని సూచిస్తున్నారు.
* చికెన్ తిన్న వెంటనే బంగాళదుంప తినకూడదని నిపుణులు అంటున్నారు. దీనికి కారణం చికెన్‌లో ఎక్కువగా ప్రోటీన్లు ఉండడం, బంగాళదుపంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండడమే. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే.. అజీర్తి సమస్యలు, వికారం, వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.