Diwali Wishes 2024: దీపావళి శుభాకాంక్షలను మీ బంధుమిత్రులకు వాట్సాప్ స్టేటస్ లో ఇలా తెలపండి

Update: 2024-10-31 01:35 GMT

Diwali Wishes 2024: దీపావళి హిందువులకు ఎంతో ప్రత్యేకమైన పండగ. దీపావళి నాడు దగ్గరి బంధువులకే కాదు..దూరపు బంధువులకు, స్నేహితులకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతుంటారు. మీరు కూడా మీ బంధుమిత్రులకు అందమైన కోట్స్ తో శుభాకాంక్షలు చెప్పాలని సెర్చ్ చేస్తున్నారా. ఇక్కడ మేము కొన్ని అందమైన విషెస్ ను తెలుగులో అందించాము. మీరు వీటిని మెసేజ్ ల రూపంలో వాట్సాప్ లో, సోషల్ మీడియాలోనూ వాడుకోవచ్చు. మీకు నచ్చిన విషేస్ ను సెలక్ట్ చేసుకోండి.

1. అంతరంగంలో అంధకారం అంతరిస్తే..వ్యక్తిత్వం వెలుగులీనుతుంది. జీవితం ఆనంద దీపావళిని ప్రతిఫలిస్తుంది.

2. దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు...సిరి సంపదలతో వర్థిల్లును మీ నట్టిల్లు.

3. ముంగిట్లో ఎగిసె తారాజువ్వల పతంగం,

మది పొరలలో విరిసె ఆనందాల సంబరం,

చీకట్లను పారదోలే వెలుగు పర్వం,

పాపాలను హరించే కాంతుల హారం .

పిండి వంటల ఘమఘమల పరిమళం

బంధుమిత్రులత ఇళ్లంతా కోలాహలం

జగతిని జాగ్రుతం చేసే దీపాల అలంకరణం

ప్రగతిని కలిగించే లక్ష్మీమాతకు ఆహ్వానం

చెడు మీద మంచి గెలుపునకు సూచకం ఈ పర్వదినం

4. నరకాసురుని వధించి

నరులందరి జీవితాల్లో వెలుగును నింపిన మాత సత్య సౌర్యానికి

చెడుపై మంచి విజయానికి ప్రతీక ఈ దీపావళి.

5. దివ్య కాంతుల వెలుగులు, అష్టైశ్వరాల నెలవు, ఆనందాల కొలువు, సర్వదా మీకు కలుగు ..మీకు మీ కటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

6. పటాకుల కాంతితో ఆకాశం ప్రకాశిస్తుంది, ఇది చుట్టూ ఆనందం సీజన్..దీపావళి వచ్చింది ..ప్రేమను తెచ్చింది.

7. అష్ట లక్ష్ములు మీ ఇంట్లో నెలవై, మీకు సకల శుభాలను, ధైర్యం, స్థైర్యం విజయాలను

జ్నానం, విద్య, బుద్ధి, సిరి సంపదలను, సుఖసంతోషాలను భోగభాగ్యాలను, ఎల్లవేళల ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ..మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

8. చీకటి నుంచి వెలుగుకి, అజ్నానం నుంచి జ్నానానికి, ఓటమి నుంచి గెలుపునకు, గమనంలో వెలుగులు పంచే చిరుదివ్వెల కాంతులు, మీ జీవితాన నిరంతరం ప్రసరించాలని కోరుకుంటూ , మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. 

Tags:    

Similar News