Health: ఛాతిలో మంటగా ఉంటుందా.? ఈ టిప్స్‌ పాటించండి..

ఇంతకీ ఛాతిలో మంట రాగానే చేయాల్సిన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Update: 2024-09-08 07:08 GMT

Health: ఛాతిలో మంటగా ఉంటుందా.? ఈ టిప్స్‌ పాటించండి.. 

ఛాతిలో మంటగా ఉండడం సర్వసాధారణమైన విషయం. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడే ఉంటారు. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, జీవన శైలి మారిన కారణంగా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, ఆహారం తీసుకునే సమయంలో మార్పుల కారణంగా ఛాతిలో మంట సమస్య వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఛాతిలో మంట పెద్ద సమస్యగా మారకపోయినా కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు.

కొన్ని సందర్భాల్లో గుండె సంబంధిత సమస్యలకు కూడా ఛాతిలో మంట ఒక లక్షణంగా నిపుణులు చెబుతుంటారు. అందుకే ఛాతిలో మంటను అస్సలు లైట్ తీసుకోకూడదని, వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తుంటారు. అయితే ఛాతిలో మంట వస్తే కొన్ని నేచురల్‌ టిప్స్‌ పాటించడం ద్వారా కూడా చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఛాతిలో మంట రాగానే చేయాల్సిన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఛాతిలో మంట రావడానికి ప్రధాన కారణాల్లో సమయానికి భోజనం చేయకపోవడమని నిపుణులు చెబుతున్నారు. భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ గ్యాప్‌ ఇవ్వడం వల్ల కడుపులో అల్సర్‌ లెవల్స్‌ పెరుగుతాయి. ఇది ఛాతిలో మంటకు దారి తీస్తుందని అంటున్నారు. అందుకే వేళకు భోజనం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి.

* ఇక ఒకేసారి ఎక్కువగా భోజనం చేసినా ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొంచెం కొంచెం ఎక్కువసార్లు తీసుకోవాలని చెబుతున్నారు.

* కొందరు తిన్న వెంటనే పడుకుంటుంటారు. అయితే ఇది కూడా ఛాతిలో మంటకు దారి తీస్తుందని నిపునులు చెబుతున్నారు. తిన్న తర్వాత కనీసం గంట తర్వాతే మంచం ఎక్కాలని సూచిస్తున్నారు. తిన్న తర్వాత కనీసం 15 నిమిషాలు నడవడాన్ని అలవాటు చేసుకోవాలి.

* క్రమం తప్పకుండా వ్యాయామం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాకింగ్ చేయడం వల్ల ఛాతిలో మంట సమస్య బలాదూర్‌ అవుతుంది.

* కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడి కూడా ఛాతిలో మంటకు దారి తీస్తుంది. ఆందోళన వంటివి కూడా ఛాతిలో మంటకు దారి తీస్తాయి. అందుకే ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి.

* స్మోకింగ్ చేయడం, మద్యం సేవించడం కూడా ఛాతిలో మంటకు దారి తీస్తుంది. అందుకే ఈ అలవాట్లు ఉన్న వారు వెంటనే మానేయాలి. లేదంటే మంట మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా లభించిన సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News