Pregnancy Parenting Tips : డెలివరీ అయిన వెంటనే నీళ్లు తాగకూడదా? తాగితే ఏమవుతుంది?

Pregnancy Parenting Tips : ప్రసవం అయ్యాక చాలా మంది బాలింతలకు తాగడానికి నీళ్లు ఇవ్వరు. డెలివరీ అయిన వెంటనే నీళ్తు తాగకూడదా? తాగితే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు?

Update: 2024-06-19 02:30 GMT

Pregnancy Parenting Tips : డెలివరీ అయిన వెంటనే నీళ్లు తాగకూడదా? తాగితే ఏమవుతుంది?

Pregnancy Parenting Tips : డెలివరీ అయిన తర్వాత చాలా మంది మహిళలు బలహీనంగా, అలసటగా ఉంటారు. సాధారణంగా కళ్లు తిరగడం, సరిగ్గా నిల్చోలేకపోవడం, తలలో తిప్పినట్లు అనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో వైద్యులు ముందుగా నీళ్లు తాగమని సలహా ఇస్తారు. ప్రసవించిన తర్వాత మహిళలు ఇలాంటి సమస్యలు ఎదుర్కుంటున్నప్పుడు నీళ్లు తాగకూడదని అమ్మమ్మలు, నాన్నమ్మలు చెబుతుంటారు. కానీ డెలివరీ తర్వాత మహిళలు తగినంత నీరు తాగనట్లయితే..ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రసవం అయిన వెంటనే నీళ్లు తాగడానికి, పొట్ట పెరగడానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు వైద్యులు. ఇది అపోహ మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు.

చల్లటి నీరు తాగడం ఎందుకు మంచిది కాదు?

ప్రసవం తర్వాత వెచ్చని నీరు, వేడి పానీయాలు మాత్రమే తాగమని సలహా ఇస్తారు. చాలా మంది మహిళలు డెలివరీ తర్వాత చల్లని నీరు తాగకూడదని చెబుతుంటారు. ఎందుకంటే ఇది జలుబు, దగ్గుకు కారణం అవుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత మీ శరీరం కోలుకోవడానికి వేడి సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. డెలివరీ తర్వాత చల్లని నీరు త్రాగడం దీర్ఘకాలిక జలుబులను నివారిస్తుందని.. మీ గర్భం దాని పూర్వ పరిమాణానికి తగ్గిపోకుండా నిరోధిస్తుందని సాధారణంగా భావిస్తారు. చల్లని నీరు తల్లి పాల నాణ్యత, ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుంది. చల్లని నీరు, పానీయాలు మీ నవజాత శిశువుకు జలుబు, ఇతర సమస్యలకు కారణం అవుతుంది.

డీహైడ్రేషన్‌:

నిజానికి ప్రసవం తర్వాత శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. మీ శరీరంలో కావాల్సినంత ద్రవాలు లేనట్లయితే ఈ ప్రభావం తల్లిపాల ఉత్పత్తి ప్రభావం చూపుతుంది. తల్లి కడుపులో సరిపడా ద్రవాలు ఉంటేనే పాలు త్వరగా ఉత్పత్తి అవుతాయి. తల్లి పాలు సరిగ్గా రానట్లయితే..దీని ఎఫెక్ట్ శిశువు ఆరోగ్యంపై పడుతుంది. ఎందుకంటే ప్రసవించిన మూడు రోజుల్లో వచ్చే పాలు బిడ్డకు చాలా ముఖ్యమైంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది డీప్ వెయిన్ థ్రాంబోసిస్, బ్లడ్ కోగ్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్‌ను అడ్డుకుంటుంది. కాబట్టి ప్రసవం తర్వాత గోరువెచ్చని నీటిని తాగడం మంచిది.

ప్రసవించిన వెంటనే నీళ్లు తాగకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి?

-డెలివరీ తర్వాత నీళ్లు తాగకపోతే రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

-యూటీఐ

-మలబద్ధకం

-డీహైడ్రేషన్

-తీవ్రమైన బలహీనత

-అలసట

-శరీర నొప్పులు వంటి సమస్యలు ఉండవచ్చు.

Tags:    

Similar News