Parenting Tips: గర్భిణీలు బరువు తక్కువగా ఉంటే పుట్టే పిల్లలకు ప్రమాదమా?
Parenting Tips: గర్భం దాల్చినప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా ఉంటే అంతే మంచిది. అయితే గర్భిణి సమయంలో ఆడవారు తక్కువ బరువు ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకోండి.
Parenting Tips:గర్భవతిగా ఉన్న సమయంలో పుట్టబోయే బిడ్డ పెరుగుదలతోపాటు గర్బిణీల శరీర బరువు కూడా పెరుగుతుంది. అయితే ఉండాల్సిన బరువు ఉండకపోతే ఇది పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో గర్భిణీలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పిల్లల అభివ్రుద్ధిలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. రోజులు పెరిగేకొద్దీ బరువు పెరుగుతారు. అయితే తగినంత ఎదుగుదల లేకుంటే ముందే డెలివరీ అవ్వడం,పుట్టినవారు తక్కువ బరువుతో పుట్టడం, బిడ్డ పెరగకపోవడం అనేక సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి బరువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
2018 అధ్యయనాల ప్రకారం..గర్భవతిగా ఉన్న సమయంలో గర్భదారణకు ముందుకు స్త్రీలో అనుసరించే డైట్ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తల్లి బరువు తక్కువగా ఉంటే పుట్టే బిడ్డ బ్రెయిన్ డెవలప్ మెంట్ మందగించడం, తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. బాడీమాస్ ఇండెక్స్ తక్కువగా ఉంటే పుట్టబోయే బిడ్డకు సమస్యలు వస్తాయి. బిడ్డకు మాత్రమే కాదు తల్లికి కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగానే ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది.
గర్భాశయంలోని వాతావరణం పుట్టే పిల్లల ఎదుగుదలకు అనుకూలంగా ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. గర్భిణీలకు పోషకాలు లోపిస్తే పుట్టబోయే బిడ్డకు పోషకాలు అందవు. దీని కారణంగా ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి ముందుగానే పిల్లలు పుటే ఛాన్స్ ఉంటుంది. పుట్టిన పిల్లలకు కూడా భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. పెరుగుదల లోపం, ఇతర సమస్యలు వస్తాయి.
సాధారణంగా గర్భవుతులు తక్కువ బరువు ఉంటే పోషకాల పోపం తక్కువగా ఉన్నట్లే అని అర్థం. దీని వల్ల బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. ఫొలేట్, ఐరన్, క్యాల్షియం వంటి సూక్ష్మపోషకాలు లోపిస్తే మెదడు నరాల బలహీనత, పిల్లల్లో ఎముకల బలహీనత తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. ఇవే కాదు ఇమ్యూనిటీ తగ్గడం, పుట్టిన తర్వాత కూడా అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.