Health Tips: ఈ ఆహారాలు అధికంగా తింటే క్యాన్సర్ ప్రమాదం.. అవేంటంటే..?

Health Tips: నేటి బిజీ జీవనశైలిలో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి.. ఇన్‌స్టెంట్‌ ఫుడ్‌ అలవాటు చేసుకొని చాలామంది ఇబ్బందిపడుతున్నారు.

Update: 2023-02-26 01:30 GMT

Health Tips: ఈ ఆహారాలు అధికంగా తింటే క్యాన్సర్ ప్రమాదం.. అవేంటంటే..?

Health Tips: నేటి బిజీ జీవనశైలిలో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి.. ఇన్‌స్టెంట్‌ ఫుడ్‌ అలవాటు చేసుకొని చాలామంది ఇబ్బందిపడుతున్నారు. కొన్ని ఆహారాలని ప్రతిరోజు తీసుకొని ప్రమాదకరమైన క్యాన్సర్‌ బారినపడుతున్నారు. ఆరోగ్య నిపుణులు కొన్ని ఆహారాలని పరిమితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అతిగా తినడం వల్ల క్యాన్సర్‌తో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుందాం.

రెడ్ మీట్ : గొడ్డు మాంసం, పంది మాంసం లేదా మేక మాంసాన్ని అధికంగా లేదా రోజూ తింటే కడుపు సమస్యలు ఏర్పడుతాయి. ఇది తేలికగా జీర్ణం కాని ఆహారం. దీని వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. గుండెజబ్బులు ఉన్నవారు మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది.

డ్రై వెజిటబుల్స్ : ఎండిన కూరగాయలను జీర్ణం చేయడం చాలా కష్టం. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వాతం పెరుగుతుంది. కూరగాయాలు ఎప్పుడైనా సరే పచ్చిగా లేదా తాజాగా ఉన్నప్పుడే తీసుకోవాలి. లేదంటే ఆరోగ్యానికి మంచిది కాదు.

పచ్చి ముల్లంగి : ఆయుర్వేదం ప్రకారం ముల్లంగిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి మన పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కానీ ప్రతిరోజూ పచ్చి ముల్లంగిని సలాడ్ రూపంలో తీసుకుంటే అది శరీరంలో పొటాషియం స్థాయిని పెంచి థైరాయిడ్ సమస్యలను కలిగిస్తుంది.

పులియబెట్టిన ఆహారం : జున్ను, పెరుగు, దోస వంటి ఆహారాలు పులియబెట్టినవిగా చెప్పవచ్చు. వీటిని క్రమం తప్పకుండా తినడం శరీరానికి మంచిది కాదు. వీటి వల్ల మంట, రక్త రుగ్మతలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News