Urinary Tract Infection: ఈ జ్యూస్ తాగితే చాలు.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కు మందులు అక్కర్లేదు

Urinary Tract Infection: యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది పురుషులతో పోలిస్తే..స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది.

Update: 2024-06-24 08:30 GMT

Urinary Tract Infection: ఈ జ్యూస్ తాగితే చాలు.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కు మందులు అక్కర్లేదు

Urinary Tract Infection: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్య. స్త్రీలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏ సందర్భంలోనైనా, ఎప్పుడైనా గురికావచ్చు. అలాగే, ఈ సమస్య పురుషులలో చాలా అరుదుగా కనిపిస్తుంది. మూత్రంలో మంట, రక్తస్రావం, కొన్నిసార్లు జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పలు నివేదికల ప్రకారం 50 నుంచి 60శాతం మంది మహిళలు తమ జీవితకాలంలో ఎప్పుడో ఒక్కప్పుడు మూత్రనాళ ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటారు. ప్రతి 10 మంది పురుషుల్లో ఒకరు వారి జీవిత కలంలో ఈ ఇన్పెక్షన్ బారిన పడుతుంటారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఏ వయస్సువారికైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. పురుషులతో పోల్చితే..మహిళల్లో మూత్రం బయటకు వెళ్లే మార్గం చాలా చిన్నగా, సున్నితంగా ఉంటుంది. దీంతో బ్యాక్టీరియా చేరితే సులువుగా వ్యాపిస్తుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ మూత్ర వ్యవస్థలోని ఏ బాగానికైనా రావచ్చు. మూత్రనాళంపై హానికరమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందడం, తక్కువ నీరు తాగడం, పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాల వల్ల మహిళలు తరచుగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు గురవుతారు. UTI చికిత్సకు వైద్యులు సాధారణంగా యాంటీబయాటిక్స్‌ను సూచిస్తారు. మీరు డాక్టర్ మందులు లేకుండా ఈ సమస్య నుండి బయటపడాలంటే ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

ఎక్కువ నీరు తాగడం:

మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో నీరు త్రాగడం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మూత్ర నాళం నుండి బ్యాక్టీరియాను బయటకు పంపడంలో సహాయపడుతుంది. నిమ్మకాయ, దాని ఆమ్ల స్వభావం ఉన్నప్పటికీ, శరీరంపై ఆల్కలీన్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మూత్ర నాళంలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ఒక గ్లాసు తాజా స్ప్రింగ్ వాటర్‌లో సగం నిమ్మరసం కలపుకుని రోజుకు ఒకసారి త్రాగాలి.

వేప ఆకుల ప్రయోజనాలు:

వేప ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తరచుగా వచ్చే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందడానికి మీరు ఈ ఆకులను తినవచ్చు. ఎందుకంటే వాటి వినియోగం మూత్ర నాళం నుండి బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ల వల్ల వచ్చే వాపును తగ్గించడంలో సహాయపడతాయి. వేప ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి కొన్ని నిమిషాలు ఉడికించి, ఆపై గోరువెచ్చని నీరు త్రాగాలి.

క్రాన్‌ బెర్రీ జ్యూస్‌:

క్రాన్‌ బెర్రీస్ యూటీఐ సమస్యను తగ్గించడంలో మేలు చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీటిలో ఉండే ఫెనోలిక్ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్‌కు మూత్రనాళ సమస్యలను నివారించే గుణం ఉంటుంది. మూత్రనాళంలో ఉన్న బ్యాక్టీరియాలను తగ్గించడానికి, మంట నుంచి ఉపశమనం పొందడానికి, బ్లాడర్, గ్యాస్ట్రోఇన్‌టెస్టినల్స్ ట్రాక్ట్స్‌లో నెలకొన్న ఇబ్బందులను తొలగించడంలో క్రాన్‌బెర్రీ జ్యూస్ బాగా పనిచేస్తుంది. క్రాన్బెర్రీ జ్యూస్, క్రాన్బెర్రీ సప్లిమెంట్స్, ఎండిన క్రాన్బెర్రీస్ యూటీఐల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News