Papaya: ప్రతిరోజూ ఉదయం గిన్నెడు ఈ పండ్లముక్కలు తింటే కలిగే ప్రయోజనాలు.. తెలిస్తే బిత్తరపోతారు..!
Bowl Of Papaya Daily: ప్రతిరోజూ ఉదయం మనం తీసుకునే బ్రేకఫాస్ట్ రోజంతటిపై ప్రభావం పడుతుంది. ప్రధానంగా ఆ రోజంతటికీ కావాల్సిన శక్తి అందించాలి.

Papaya: ప్రతిరోజూ ఉదయం గిన్నెడు ఈ పండ్లముక్కలు తింటే కలిగే ప్రయోజనాలు.. తెలిస్తే బిత్తరపోతారు..!
Bowl Of Papaya Daily: ప్రతిరోజూ ఉదయం గిన్నెడు బొప్పాయి ముక్కలు తింటే ఆరోగ్యప్రయోజనాలు మెండు. ఇందులో పప్పైయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కడుపులో అజీర్తి గ్యాస్ కూడా తగ్గిపోతుంది. బొప్పాయిలో విటమిన్ సీ, ఏ ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచి కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రెగ్యులర్‌గా బొప్పాయి తిన్నవారి చర్మం కూడా మెరుస్తూ కనిపిస్తుంది.
వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం గిన్నెడు బొప్పాయి ముక్కలు తినాలి. దీంతో ఇది బెల్లీఫ్యాట్‌ను కూడా తగ్గించేస్తుంది. ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఎక్కువ శాతం ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అతిగా చిరుతిళ్లు కూడా తినకుండా ఉంటారు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు బొప్పాయి తినాలి.
బొప్పాయిలో ఫైబర్‌తోపాటు పొటాషియం కూడా ఉంటుంది. ఇది రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. దీంతో మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బొప్పాయి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేస్తాయి. షుగర్ కూడా నిర్వహిస్తుంది. ఇది సోడియం స్థాయిలన కూడా సరిచేస్తుంది. దీంతో మీ కార్డియో ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రధానంగా బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ, సీ, ఇ వల్ల అర్టెరీస్ బ్లాకేజీ కాకుండా కాపాడుతాయి.
బొప్పాయిని తినడం వల్ల దీర్ఘకాలిక మలబద్దక సమస్యను కూడా తగ్గించేస్తుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. డైజేస్టీవ్ ఎంజైమ్స్ ఆహారాన్ని విడగొట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇక బొప్పాయిలో కొన్ని రకాల కేన్సర్ ప్రమాదాలకు వ్యతిరేకంగా పనిచేసే గుణాలు కలిగి ఉంటాయి. కాలేయం, ప్రోస్టేట్ కేన్సర్ సెల్స్ అభివృద్ధి చెందకుండా చేస్తాయి.
బొప్పాయి ముఖం ఉండే డెస్ స్కిన్ సెల్స్‌ను కూడా తొలగిస్తుంది. ఇందులో గాయాలను నయం చేసే గుణాలు కూడా ఉంటాయి. ఓపెన్ పోర్స్‌ను కూడా తగ్గిస్తాయి. ముఖంపై మచ్చలు, గీతలను తొలగిస్తుంది. యాక్నేకు సైతం వ్యతిరేకంగా పోరాడుతుంది. ఆక్సిడేటీవ్ స్ట్రెస్ నుంచి కాపాడుతాయి. పీరియడ్స్ పెయిన్ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. బొప్పాయి తినడం మాత్రమే కాదు దీంతో ఫేస్‌ప్యాక్ కూడా తయారు చేసుకుంటారు. దీంతో కూడా ముఖం కాంతివంతంగా మారుతుంది.