Lifestyle: పేగు ఆరోగ్యంగా ఉంటేనే మానసిక ఆరోగ్యం.. పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు
మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. అందుకోసమే యోగా, మెడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలని సూచిస్తుంటారు.

Lifestyle: పేగు ఆరోగ్యంగా ఉంటేనే మానసిక ఆరోగ్యం.. పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు
మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. అందుకోసమే యోగా, మెడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలని సూచిస్తుంటారు. అయితే మానసిక ఆరోగ్యంపై ఎన్నో రకాల అంశాలు ప్రభావం చూపుతాయని మనందరికీ తెలిసిందే. మరి పేగు ఆరోగ్యం కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అంటే మీరు నమ్ముతారా.? అవును వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం.
ఆరోగ్యకరమైన పేగు ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి, దానిలోని పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే మన పేగు ఆరోగ్యం మానసిక స్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని మీకు తెలుసా.? శరీరంలోని దాదాపు 90% సెరోటోనిన్, 50% కంటే ఎక్కువ డోపమైన్ వంటి రెండు ముఖ్యమైన న్యూరోట్రాన్స్మిటర్లు పేగులోనే ఉత్పత్తి అవుతాయి. మానసిక ఆరోగ్యాన్ని ప్రభావంపై చూపడంలో వీటి పాత్ర కీలకం.
మానవ శరీరంలోని సెరోటోనిన్‌లో దాదాపు 90%, డోపమైన్‌లో 50% కంటే ఎక్కువ కడుపులోనే ఉత్పత్తి అవుతాయి. కడుపు ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉన్నట్లు హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. వారి పరిశోధనలు 2024 చివరలో మైక్రోబయోమ్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనం సిట్రస్ పండ్లు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని చెబుతోంది. ఇందులో భాగంగా 30,000 కంటే ఎక్కువ మంది మహిళల డేటాను విశ్లేషించారు. అధ్యయనం ఆధారంగా, సిట్రస్ పండ్లను ఎక్కువగా తినే స్త్రీలు, వాటిని తినని వారి కంటే నిరాశకు గురయ్యే అవకాశం చాలా తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
సిట్రస్ జాతి పండ్లను రెగ్యులర్‌గా డైట్‌లో భాగం చేసుకుంటే డిప్రెషన్ ప్రమాదాన్ని 20 శాతం తగ్గిస్తుంది. ఇది పేగులను బలంగా ఉంచుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజూ ఒక నారింజ పండు తినడం వల్ల డిప్రెషన్ వచ్చే ప్రమాదం 20% తగ్గుతుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ గెజిట్‌లో పేర్కొన్నారు. అయితే ఇతర పండ్లతో పోల్చితే సిట్రస్ జాతి పండ్లతోనే ఇది సాధ్యమవుతున్నట్లు గుర్తించారు. మలం నమూనాలలో, పరిశోధకులు ఎక్కువగా సిట్రస్ పండ్లు తినడం వల్ల ఫేకాలిబాక్టీరియం ప్రౌస్నిట్జి అనే ప్రయోజనకరమైన గట్ బాక్టీరియం స్థాయిలు పెరుగుతాయని కనుగొన్నారు. 2022లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో సిట్రస్ పండ్లను తక్కువగా తినేవారికి నిరాశ ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు.