Iron: ఈ 5 ఐరన్‌ పుష్కలంగా ఉండే ఆహారాలు తింటే.. జుట్టు మోకాళ్ల కిందకు పెరగడం ఖాయం..!

Iron Rich 5 Foods: ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకుంటే జుట్టు కూడా పెరుగుతుంది. ఇది మన శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా హెయిర్ ఫాలికల్స్‌కు ఆక్సిజన్ అందుతుంది.

Update: 2025-03-26 09:11 GMT
Iron

Iron: ఈ 5 ఐరన్‌ పుష్కలంగా ఉండే ఆహారాలు తింటే.. జుట్టు మోకాళ్ల కిందకు పెరగడం ఖాయం..!

  • whatsapp icon

Iron Rich 5 Foods: ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మన శరీరంలో రక్తం స్థాయులు పెరగడం మాత్రమే కాదు. ఆక్సిజన్ స్థాయిలు కూడా హెయిర్ ఫాలికల్స్‌కు అందుతాయి. తద్వారా జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఐరన్ లేమితో బాధపడుతున్న వారికి జుట్టు రాలే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఐరన్ పుష్కలంగా ఉండే ఐదు ఆహారాలు ఉన్నాయి. వాటిని డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

గుమ్మడి గింజలు..

గుమ్మడి గింజలు పోషకాలకు పవర్ హౌస్‌. ఇందులో ఐరన్, మెగ్నీషియం, జింక్ ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. గుమ్మడి గింజలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జింక్‌ లేమి సమస్యతో బాధపడుతున్న వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు ఇది కుదుళ్ల ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. కుదుళ్లపై అదనపు నూనెను గ్రహించి, చుండ్రు రాకుండా కాపాడుతుంది. కుదుళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం రక్త సరఫరాను మెరుగు చేస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. గుమ్మడి గింజలను స్నాక్ రూపంలో తీసుకోవచ్చు.

పాలకూర..

పాలకూర కూడా పోషకాలకు పవర్ హౌస్ ఇందులో ఖనిజాలు పుష్కలం. ఇందులో ఐరన్ కూడా ఉంటుంది. దీంతో మన శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుంది. పాలకూరలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది పోషకాలను ఐరన్ గ్రహించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే పోలెట్, బీటా కెరొటిన్ కూడా శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది హెయిర్ డ్యామేజ్ కాకుండా.. పొడి బారకుండా కాపాడుతుంది. పాలకూరను స్మూథీ లేదా ఫ్రై రూపంలో తీసుకోవచ్చు. ప్రధానంగా ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి వేసుకొని పాలకూర తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.

తోఫు..

తోఫులో కూడా ప్రోటీన్ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి వేగన్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఒక అర కప్పు తోఫులో మూడు గ్రాములకు పైగా ఐరన్ ఉంటుంది. తోఫు తీసుకోవడం వల్ల ఇందులో అమైనో యాసిడ్స్ జుట్టు బలంగా మారడానికి సహాయపడి స్ప్లిట్‌ ఎండ్ సమస్య రాకుండా నివారిస్తుంది. తోఫును సూప్స్‌లో వేసుకొని తీసుకోవచ్చు.

రెడ్ మీట్..

రెడ్ మీట్‌లో కూడా ఎక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది మన జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. రెడ్ మీట్‌లో ఎక్కువ మోతాదులో ప్రోటీన్, విటమిన్ బి 12, జింక్ కూడా ఉంటుంది. ఇది జుట్టు మందంగా పెరగడానికి సహాయపడుతుంది. సమతుల ఆహారం కూడా అవుతుంది. రెడ్‌ మీట్‌ ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. సూప్ రూపంలో తీసుకున్న మంచి ఫలితాలు లభిస్తాయి.

తృణధాన్యాలు..

జుట్టు పెరుగుదలకు ఐరన్ పుష్కలంగా ఉండే తృణధాన్యాలు తీసుకోవాలి. ఇందులో ప్రోటీన్, ఐరన్, ఫైబర్ ఉంటుంది. ఇది మంచి ఆరోగ్యకరమైన ఆహారం అవుతుంది. బయోటిన్, జింక్‌ కూడా కలిగి ఉండటం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి ఆరోగ్యంగా పెరిగింది. శరీరంలో ఐరన్‌ స్థాయిలను పెంచి జుట్టు ఊడిపోకుండా సహాయపడుతుంది, మంచి పోషణ అందిస్తుంది.

Tags:    

Similar News