Hair Dye: తరచూ జుట్టుకు రంగు వేస్తున్నారా? అయితే, ఈ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..
Hair Dye Side Effects: తరచూ జుట్టుకు రంగు వేస్తే ఎంత ప్రమాదకరమో తెలుసా? రంగు మార్చినప్పుడల్లా కొత్త లుక్ వస్తుంది. దీంతో మనం ఎంజాయ్ చేస్తాం. కానీ, ఆ తర్వాత వచ్చే దుష్ప్రభావాలు మీరు ఊహించరు.

Hair Dye: తరచూ జుట్టుకు రంగు వేస్తున్నారా? అయితే, ఈ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..
Hair Dye Side Effects: మీకు తరచూ జుట్టుకు రంగు వేసే అలవాటు ఉందా? బీకేర్‌ఫుల్..హెయిర్ ఫాల్ సమస్య కూడా పెరుగుతుంది. ఎక్కువ మోతాదులో తరచూ రంగు ఉపయోగించడం వల్ల మీ కుదుళ్ల ఆరోగ్యం కూడా కుంటుపడిపోతుంది. ఫలితంగా మీ కుదుళ్లు పొడి బారిపోతాయి. దీంతో ప్రాణాంతక సైడ్ ఎఫెక్ట్స్ కూడా తప్పవు.
తరచూ రంగు మార్చడం వల్ల మీ కుదుళ్లు డ్యామేజ్ అయిపోతాయి.. హెయిర్ ఫాల్ సమస్య పెరిగిపోతుంది. కలర్ లో హానికర కెమికల్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి అమోనియా, హైడ్రోజన్ పెరడాక్సైడ్ కలిసి ఉంటుంది. కలిపి జుట్టుకు వేయడం వల్ల మీ జుట్టు కుదుళ్లు బలహీనంగా మారిపోతాయి. అంతేకాదు త్వరగా పొడిబారిపోయి జుట్టు ఊడిపోవడం మొదలవుతుంది. తరచుగా జుట్టుకు బ్లీచింగ్, కలరు వేయడం వల్ల ప్రోటీన్ కూడా కోల్పోతుంది. దీంతో స్ప్లిట్ ఎండ్ సమస్య వస్తుంది. హెయిర్ ఫాల్ సమస్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది.
తరచూ జుట్టుకు రంగులు వేయడం వల్ల అలర్జీ కూడా మొదలవుతుంది. జుట్టు కుదుళ్లు దురదలు, ఎరుపు రంగులోకి మారడం, హానికర అలర్జీలు మిమ్మల్ని వేధిస్తాయి. ఈ రంగుల్లో పారాసినాఫినాలియండమైన్ వల్ల జరుగుతుంది.
దీనివల్ల జుట్టుపై దురదలు మొదలవుతాయి. కుదుళ్ల ఆరోగ్యం కుంటుపడుతుంది. అలర్జీ వల్ల నొప్పి, వాపు సమస్యలు కూడా ఒక్కోసారి బొబ్బలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
మీ జుట్టుకు తరచూ కలర్ వాడటం వల్ల జుట్టు రాలిపోయి సన్నగా మారిపోతుంది. అమోనియా ఎక్కువ ఉండే ఈ రంగులు వాడటం వల్ల జుట్టు ఊడిపోవడానికి ప్రమాదం ఎక్కువగా ఉంది. తరచూ రంగులు మార్చడం వల్ల మీ జుట్టు రంగు పైనుంచి బాగానే కనబడుతుంది. కానీ అవి హానికర కెమికల్స్ కలిగి ఉండటం వల్ల స్ప్లిట్ ఎండ్ సమస్యతో జుట్టు చిట్లి పోతుంది. పర్మినెంట్‌గా హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. దీంతో జుట్టు జీవం లేనట్టుగా కనిపిస్తుంది.
ఒక్కోసారి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కారణం అవుతుంది. లేదా ఎక్కువ రంగు వేసుకోవడం వల్ల క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్‌కు గురయ్యే అవకాశం ఉంది. హార్మోనల్ అసమతులకు కూడా దారితీస్తుంది.
తరచూ జుట్టుకు రంగు వేయడం వల్ల స్కిన్ సమస్యలు కూడా మొదలవుతాయి. చర్మం పై మంటలు,వాపులు కూడా కనిపిస్తాయి. పిగ్మెంటేషన్ కూడా మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది. కుదుళ్లు ఎక్కువగా పొడి పారిపోతాయి. దురదలు వేధిస్తాయి.