Healthy diet: ఈ డైట్‌ ఫాలో అయితే ఎలాంటి రోగాలు మీ జోలికి రావు.. ఓ సారి ట్రై చేయండి!

Healthy diet: ఈ డైట్‌ ఫాలో అయ్యేవారు రెడ్ మీట్ ఎక్కువగా తినరు. ఇక పాలు, చీజ్ లాంటివి కూడా వీరి ఆహారంలో అరుదుగా కనిపిస్తాయి. డీప్ ఫ్రై, బటర్, నెయ్యి లాంటివి పూర్తిగా నిషేధం.

Update: 2025-03-25 07:57 GMT
Healthy diet

Healthy diet: ఈ డైట్‌ ఫాలో అయితే ఎలాంటి రోగాలు మీ జోలికి రావు.. ఓ సారి ట్రై చేయండి!

  • whatsapp icon

Healthy diet: మెడిటేరేనియన్ డైట్ గురించి విన్నారా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. ఉరుకుల పరుగులు జీవితంలో మన లైఫ్‌ స్టైల్‌ వేగం పెరిగింది కానీ అదే సమయంలో ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. చాలా మందికి చిన్న వయసులోనే గుండె జబ్బులు వస్తున్నాయి. టీనేజ్‌ దాటకముందే చాలామందిని కంటిచూపు సమస్యలు వేధిస్తున్నాయి. మరికొంతమందికి శరీరంలో శక్తి ఉండడంలేదు.. మోకాళ్లపై నిలబడలేకపోతున్నారు. మరికొంతమంది మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారు. 60ఏళ్లు దాటిన తర్వాత వచ్చే సమస్యలన్నీ తక్కువ వయసులోనే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మనం తినే తిండి అలా ఉంటుంది. ఇదే విషయాన్ని డాక్టర్లు సైతం చెబుతుంటారు.

ఇటివల జరిగిన పరిశోధన ఫలితాలు కూడా ఓ అంశాన్ని క్లియర్‌కట్‌గా హైలెట్‌ చేశాయి. ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, రాబిన్ మెడికల్ సెంటర్ రీసెంట్‌గా ఓ రీసెర్చ్ చేశాయి. మెడిటేరేనియన్ ఫుడ్‌ మనిషి ఆయువును పెంచేందుకు ఉపయోగపడుతుందని వారి అధ్యయనం స్పష్టం చేస్తోంది. నాలుగు వారాల పాటు జరిగిన ఈ పరిశోధనలో ముందుగా కొంతమందిని ఎంపిక చేశారు. వారికి భారతీయ రుచులకు అనుగుణంగా మెడిటేరేనియన్ డైట్ ఫాలో అయ్యేలా చేశారు. ఈ రీసెర్చ్‌ ఫలితాలు షాక్‌కు గురి చేశాయి. వారి బరువు తగ్గింది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాయి. శరీరంలో ఫోలిక్ యాసిడ్, విటమిన్లు పెరిగాయి. అంతే కాదు.. పేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాలు ఎక్కువయ్యాయి.

ఈ డైట్‌ను మన భారతీయ రుచులకు సరిపోయేలా మార్చడం పెద్ద కష్టమేమీ కాదు. కుక్‌ చేసేటప్పుడు నెయ్యికి బదులుగా రైస్ బ్రాన్ ఆయిల్ వాడారు. రుచులు తగ్గకుండా ఉండేందుకు చపాతీలపై నెయ్యి కాకుండా ఒలివ్ ఆయిల్ వేశారు. మిఠాయిల్లో పాలకు బదులుగా బాదంపాలను వాడారు. వంటలను ఫ్రై చేయకుండా గ్రిల్లింగ్, బేకింగ్‌ లాంటివి చేశారు. అంటే.. మనకు ఇష్టమైన పదార్థాలతోనే వంట చేశారు. చేసే స్టైల్‌ కాస్త మారింది. రుచి కూడా ఏ మాత్రం తగ్గలేదు. దేని టెస్ట్ దానిదే కదా! ఇక తాజా కూరగాయలు, నూనె మితంగా వాడకం ఈ డైట్‌లో ప్రధాన అంశాలు. ఇక తక్కువగా ప్రాసెస్ చేసిన ధాన్యాలు, మొలకెత్తిన ధాన్యాలు, పప్పులు, గింజలు, విత్తనాలు ప్రధానంగా వాడతారు. వండటానికి ఒలివ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ లాంటివి మాత్రమే వాడతారు.

Tags:    

Similar News