Green Tea: ప్రతిరోజు ఈ టీ తీసుకుంటే దెబ్బకు ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోవడం పక్కా..!

Green Tea Benefits: ఉదయం టీ, కాఫీ అలవాటు ఉన్నవాళ్లు చాలామంది ప్రస్తుతం గ్రీన్ టీ కి మారారు. దీంతో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి.

Update: 2025-03-26 13:00 GMT
Green Tea

Green Tea: ప్రతిరోజు ఈ టీ తీసుకుంటే దెబ్బకు ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోవడం పక్కా..!

  • whatsapp icon

Green Tea Benefits: మీరు ఇప్పటి వరకు గ్రీన్ టీ మీ డైట్ లో చేర్చుకోలేదా? అయితే ఈ ప్రయోజనాలు తెలిస్తే ఈరోజు నుంచే గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటారు. వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శరీర ఆరోగ్యానికి తప్పకుండా ప్రతిరోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగుతారు.

కొన్ని నివేదికల ప్రకారం గ్రీన్ టీ లో పాలీఫెనల్స్‌ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ చాలా పవర్ ఫుల్‌గా ఉంటాయి. ఇందులో కేన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే లక్షణాలు ఉంటాయి. గ్రీన్‌ టీ తీసుకున్న వారికి కార్డియో ప్రమాదాలు కూడా తక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గించేస్తాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయులను పెంచేస్తాయి. గ్రీన్ టీ రెగ్యులర్‌గా తీసుకునే వారిలో ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలంగా ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు కూడా కలిగి ఉంటాయి. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల బరువు నిర్వహణలో ఉంటుంది.

గ్రీన్ టీ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందడమే కాకుండా.. మెటాలిజం రేటు పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మన శరీర కొవ్వును వెంటనే తగ్గించేస్తాయి. గ్రీన్ టీ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగ్గా మారుతుంది. ఎందుకంటే ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. గ్రీన్ టీ లో ఎక్కువ శాతం యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మన సెల్ డ్యామేజ్ కాకుండా ఒక షీల్డ్ లాగా మన మెదడు పనితీరును మెరుగు చేస్తుంది. గ్రీన్ టీ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మెమొరీ పవర్ కూడా పెంచుతుంది. మూడ్ స్వింగ్స్‌ నుంచి కూడా త్వరగా బయటపడతారు.

గ్రీన్ టీ డైట్‌లో చేర్చుకున్న వారి గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇది రక్త సరఫరాను మెరుగు చేస్తుంది. తద్వారా చెడు కొలెస్ట్రాల్‌ కూడా తగ్గిపోతాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రధానంగా గ్రీన్ టీ అర్టెరీ బ్లాక్ కాకుండా రక్త నాళాలను సహాయపడి కార్డియో ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

ఉదయం గ్రీన్ టీ తీసుకోవటం వల్ల కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్యకు చెక్‌ పెడుతుంది. ఇందులో జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడే సహజ గుణాలు ఉంటాయి. తద్వారా కడుపు సమస్యలు తగ్గిపోతాయి. గోరు వెచ్చని నీటిలో గ్రీన్ టీ బ్యాగ్స్ వేసుకొని తీసుకుంటే ఇందులో నయం చేసే గుణాలు కూడా కలిగి ఉంటాయి.

అంతేకాదు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల నోటి నుంచి వచ్చే దుర్వాసనకు కూడా చెక్ పెడుతుంది. నోరు రోజంతా తాజాదనంగా ఉంటుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు ఉంటాయి. కాబట్టి చెడు బాక్టిరియా నోట్లో పెరగకుండా ఇది కాపాడుతుంది. దీంతో మీ చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

Tags:    

Similar News